క్రీడాభూమి

ఢిల్లీలోనే రిటైర్మెంట్: నెహ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: వచ్చేనెల ఒకటో తేదీన న్యూఢిల్లీలో న్యూజిలాండ్‌తో జరిగే తొలి టి-20 ముగిసిన వెంటనే, కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రకటించాడు. అతను రిటైర్మెంట్ చెప్తాడని బిసిసిఐ అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. అదే వార్తను నెహ్రా గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ధ్రువీకరించాడు. సొంతగడ్డపై, అభిమానుల సమక్షంలో రిటైర్‌కావడం కంటే ఆనందం ఏముంటుందని అన్నాడు. ‘ఎందుకు రిటైర్ అవుతున్నారని అడిగే విధంగా కెరీర్‌ను ముగించాలే తప్ప ఇంకా ఎందుకు రిటైర్ కావడం లేదని అడిగే పరిస్థితిని తెచ్చుకోకూడదు’ అని 38 ఏళ్ల నెహ్రా వ్యాఖ్యానించాడు. 20 ఏళ్ల క్రితం తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆడానని, అందుకే, అదే స్టేడియంలో రిటైరవుతానని చెప్పాడు. ఈ విషయాన్ని జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఇతర సభ్యులకు తెలిపానని అన్నాడు. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపికైనప్పుడు, అన్ని మ్యాచ్‌లు ఆడేందుకే తాను సిద్ధపడ్డానని అన్నాడు. అయితే, జట్టుకు ఉత్తమ సేవలు అందించే బాధ్యతను యువ పేసర్లు సమర్థంగా పూర్తి చేస్తున్నారని గుర్తించానని, కాబట్టి, రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నానని తెలిపాడు. కోచ్ రవి శాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించానని అన్నాడు. భువనేశ్వర్ కుమార్ ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడని ప్రశంసించాడు. జస్‌ప్రీత్ బుమ్రా కూడా రాణిస్తున్నాడని అన్నా డు. ఈ పరిస్థితుల్లో తాను నిశ్చింతగా రిటైర్ కావచ్చని చెప్పాడు.
ఐపిఎల్‌లో ఆడను..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడబోనని నెహ్రా స్పష్టం చేశాడు. జాతీయ జట్టుకు సేవలు అందించనప్పుడు ఐపిఎల్‌లో ఆడడం అనైతికమవుతుందని వ్యాఖ్యానించాడు. 2011లో వరల్డ్ కప్‌ను గెల్చుకున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో ఆనందించానని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి, చివరి ఓవర్ బౌల్ చేయాల్సిందిగా కెప్టెన్ కోరిన ప్రతిసారీ తనకు చాలా గర్వంగా ఉంటుందని అన్నాడు. ఎన్నో సందర్భాల్లో తాను ఈ విధంగా చివరి ఓవర్ వేశానని చెప్పాడు.