క్రీడాభూమి

భారత్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: వేలాది మంది అభిమానుల సమక్షంలో గురువారం ఘనాతో గ్రూప్ ‘ఎ’లో తలపడిన భారత్ 0-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. కీలక విజయాన్ని నమోదు చేసిన ఘనా ప్రీ క్వార్టర్స్ చేరింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడడంతో, నాకౌట్ దశకు చేరుకునే అవకాశం భారత్‌కు దక్కలేదు. నిజానికి ఘనాతో జరిగిన మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు గట్టిపోటీనిచ్చింది. ఒకవైపు గోల్స్‌కు ప్రయత్నిస్తూనే, మరోవైపు ప్రత్యర్థులు రక్షణ వలయంలోకి చొచ్చుకురాకుండా అడ్డుకుంది. అయితే, 43వ నిమిషంలో ఎరిక్ అయా భారత డిఫెన్స్‌ను ఛేదిస్తూ తొలి గోల్‌ను నమోదు చేశాడు. మరో తొమ్మిది నిమిషాల తర్వాత అతను తన ఖాతాలో రెండో గోల్ వేసుకున్నాడు. మెరుపువేగంతో దూసుకెళ్లిన అతనిని నిలువరించడంలో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత్ ప్రతిఘటనను నిలువరిస్తూ, సమయం దొరికిన ప్రతిసారీ ఘనా దాడులకు ఉపక్రమించింది. 86వ నిమిషంలో రిచర్డ్ డాస్నో గోల్ చేయగా, ఒక నిమిషం తేడాతో ఇమాన్యుయెల్ టొకూ చేసిన గోల్‌తో ఘనా ఆధిక్యం 4-0కు చేరింది. భారత్ ఎంత ప్రయత్నించినా గోల్స్ చేయలేకపోవడంతో, ఘనాకు అదే తేడాతో విజయం సాధ్యమైంది.
నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో అమెరికా, కొలంబియా జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆట మొదలైన మూడో నిమిషంలోనే జువాన్ విడాల్ గోల్ చేసి, కొలంబియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, ఆ వెంటనే ఎదురుదాడికి ఉపక్రమించిన అమెరికా 24వ నిమిషంలో జార్జి అకోస్టా ద్వారా ఈక్వెలైజర్‌ను సంపాదించింది. ఆతర్వాత ఇరు జట్లు హోరాహోరీ పోరాటాన్ని సాగించాయి. డెడ్‌లాక్‌ను ఛేదిస్తూ 67వ నిమిషంలో జువాన్ పెనలొజా, 87వ నిమిషంలో డిబర్ కెసిడో గోల్స్ చేయడంతో కొలంబియా 3-1 ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా, మూడు మ్యాచ్‌ల్లో మొదటిసారి ఓడినప్పటికీ, ఇది వరకే రెండు మ్యాచ్‌లను గెల్చుకోవడంతో అమెరికా నాకౌట్ దశకు దూసుకెళ్లింది. ‘ఎ’ గ్రూప్ నుంచి ఘనా తోపాటు ముందంజ వేసింది.
గ్రూప్ ‘బి’లో న్యూజిలాండ్‌పై మాలీ విజయం సాధించగా, నవీ ముంబయిలో టర్కీని పరాగ్వే 3-1 తేడాతో ఓడించింది. న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కివీస్‌పై మొదటి నుంచి ఆధిపత్యాన్ని కనబరచిన మాలీకి 18వ నిమిషంలోనే సలామ్ జిడావూ గోల్‌ను అందించాడు. 50వ నిమిషంలో జెమోసా ట్రవోర్, 82వ నిమిషంలో లసానా నియే గోల్స్ చేయడంతో మాలీ ఆధిక్యం 3-0కు చేరింది. ఎక్‌స్ట్రా టైమ్‌లో న్యూజిలాండ్‌కు చార్లెస్ స్ప్రాగ్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేని గోల్ లభించింది.
నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో టర్కీని ఢీకొన్న పరాగ్వే కూడా 3-1 తేడాతో విజయానిన నమోదు చేసింది. పరాగ్వే తరఫున గియోవనీ బొగాడో (41వ నిమిషం), ఫెర్నాండో కార్డోజో (43వ నిమిషం), ఆంటానియో గలియానో (61వ నిమిషం) గోల్స్ సాధించగా, టర్కీ తరఫున కరీం కెస్గిన్ ఎక్‌స్ట్రా టైమ్‌లో గోల్ చేశాడు.

చిత్రం..రెండు గోల్స్ చేసి, భారత్‌ను దెబ్బతీసిన ఘనా ఆటగాడు ఎరిక్ అయా (మధ్య)