క్రీడాభూమి

భయపెడుతున్న వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నాటి అత్యంత కీలకమైన చివరి, మూడో టి-20 ఇంటర్నేషనల్‌ను వర్షం భయం వెంటాడుతున్నది. గురువారం జల్లులు పడడంతో, ముందు జాగ్రత్త చర్యగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాగా, గురువారం నగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈనెల 20వ తేదీ వరకూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ ఇది వరకే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో, షెడ్యూల్ ప్రకారం శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుందా? ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందా? అనే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. కాగా, ఇటీవలి వర్షాలకు పిచ్ దెబ్బతినలేదని క్యూరేటర్ వైఎల్ చంద్రశేఖర్ స్పష్టం చేశాడు. అయితే, ఔట్‌ఫీల్డ్‌పై కొన్ని చోట్ల నీరు చేరిందని, వాటిని తొలగించి, భారీ ఫ్యాన్లతో ఆరబెడుతున్నామని అన్నాడు. దాదాపుగా మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచడంతో, వర్షాల వల్ల పిచ్‌కి నష్టం ఉండదని తెలిపాడు.

తొలిసారి టి-20 ఇంటర్నేషనల్
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టి-20 ఇంటర్నేషనల్ ఇప్పటి వరకూ జరగలేదు. ఎక్కువగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే ఈ స్టేడియంలో నవంబర్ 2010లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. 2012 నవంబర్‌లో అదే న్యూజిలాండ్‌ను టీమిండియా ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో చిత్తుచేసింది. 2013 మార్చిలో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 135 పరుగుల ఆధిక్యంతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌ను 208 పరుగుల తేడాతో ఓడించింది. మొత్తం మీద ఈ స్టేడియంలో ఇంత వరకూ నాలుగు టెస్టులు జరగ్గా, ఒకటి డ్రా అయింది. మిగతా మూడింటినీ భారత్ సొంతం చేసుకుంది. వనే్డ ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే, ఇక్కడ మొత్తం ఐదు మ్యాచ్‌లు జరిగాయి. 2005 నవంబర్ 16న దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డలో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆతర్వాత మరో రెండు వనే్డలను కూడా చేజార్చుకుంది. 2007 ఆక్టోబర్ 5న ఆస్ట్రేలియా 47 పరుగులు, 2009 నవంబర్ 5న అదే జట్టు 3 పరుగుల తేడాతో భారత్‌పై విజయాలను నమోదు చేసింది. 2011 అక్టోబర్ 14న ఈ స్టేడియంలో టీమిండియా మొదటిసారి ఒక వనే్డను గెల్చుకుంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 126 పరుగుల తేడాతో ఓడించింది. 2014 నవంబర్ 9న శ్రీలంకపై ఆరు వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. మొదటిసారి ఈ స్టేడియంలో జరిగే టి-20 ఇంటర్నేషనల్‌లో భారత్ గెలిచి, ఆసీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకుటుందో లేదో చూడాలి.

చిత్రం..రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచిన దృశ్యం