క్రీడాభూమి

భారత్ ‘ఎ’ ఖాతాలో మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 13: న్యూజిలాండ్ ‘ఎ’పై భారత్ ‘ఎ’ మరో విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్‌ని భారత్ ‘ఎ’ గెల్చుకుంది. శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో విజయభేరి మోగించి, సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. న్యూజిలాండ్ ‘ఎ’ బ్యాట్స్‌మన్ జార్జి వర్కర్ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విజయ్ శంకర్ (61), దీపక్ హూడా (59) కూడా అర్ధ శతకాలను సాధించారు. అనంతరం న్యూజిలాండ్ ‘ఎ’ 45.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. జార్జి వర్కర్ 108 పరుగులు చేశాడు. షాబాజ్ నదీం 33 పరుగులకు 4, సిద్ధార్థ్ కౌల్ 35 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టారు.