క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు జర్మనీ, ఇరాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, అక్టోబర్ 13: అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో గ్రూప్ ‘సి’ నుంచి జర్మనీ, ఇరాన్ జట్లు ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 3-1 తేడాతో గునియాను సులభంగా ఓడించింది. ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు కోసం కొలంబియాను ఢీ కొంటుంది. గునియాపై మొదటి నుంచి ఆధిపత్యాన్ని కనబరచిన జర్మనీకి ఎనిమిదో నిమిషంలోనే జాన్ ఫియట్ ఎఆర్‌పి మొదటి గోల్‌ను అందించాడు. దీనితో కంగుతిన్న గునియా 26వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను సాధించింది. ఇబ్రహిమ సౌమా ఈ గోల్ చేసి, గునియాకు మ్యాచ్‌పై ఆశలు పెంచాడు. ప్రథమార్ధంలో ఇరు జట్లు చెరొక గోల్‌లో సమవుజ్జీగా నిలిచాయి. ద్వితీయార్ధం ఆరంభం కూడా దాదాపు అదే రీతిలో కొనసాగింది. అయితే, ప్రతిష్ఠంభనకు నికొలాస్ కుయెన్ 62వ నిమిషంలో తెరదించాడు. చక్కటి ఫీల్డ్ గోల్‌తో అతను జర్మనీని ఆధిక్యంలో నిలిపాడు. ఇంజురీ టైమ్‌లో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న సవెర్డి సెటిన్ చేసిన గోల్‌తో జర్మనీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన గునియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
మార్గోవాలోని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 3-0 ఆధిక్యంతో కోస్టారికాను చిత్తుచేసింది. వ్యూహాత్మకంగా ఆడిన ఈ జట్టుకు 25వ నిమిషంలో కెప్టెన్ మహమ్మద్ గొబెషవీ తొలి గోల్‌ను అందించాడు. మరో నాలుగు నిమిషాల్లోనే తహా షరియాతీ మరో గోల్ చేశాడు. ఈ రెండు గోల్స్ పెనాల్టీల ద్వారా లభించినవే కావడం విశేషం. మొదటి అర్ధ గంటలోపే 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఇరాన్ ఆతర్వాత పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ఈ జట్టు నిర్మించిన పటిష్టమైన డిఫెన్స్‌ను ఛేదించలేకపోయిన కోస్టారికా గోల్స్ చేయడంలో విఫలమైంది. మ్యాచ్ ముగియడానికి ఓ నిమిషం ముందు ఇరాన్‌కు మహమ్మద్ సర్దారీ గోల్‌ను అందించాడు. ఇలావుంటే, నిబంధనలకు విరుద్ధంగా గునియా ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన ఇరాన్ కెప్టెన్ గొబెషవీని టోర్నమెంట్ అధికారులు ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశారు. దీనితో అతను ప్రీ క్వార్టర్ పైనల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
బ్రెజిల్, స్పెయిన్ ముందంజ
గ్రూప్ ‘డి’ లో బ్రెజిల్, స్పెయిన్ జట్లు కూడా ప్రీ క్వార్టర్స్ చేరాయి. తొలిసారి ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్న నిగర్‌ను బ్రెజిల్ 2-0 తేడాతో ఓడించింది. 4వ నిమిషంలో లింకన్, 34వ నిమిషంలో బ్రెన్నర్ గోల్స్ సాధించారు. ఉత్తర కొరియాను స్పెయిన్ కూడా 2-0 తేడాతోనే ఓడించింది. 4వ నిమిషంలో మహమ్మద్ వౌక్లిస్, 71వ నిమిషంలో సెసర్ గెలాబర్ట్ గోల్స్ చేశారు.
*
నేటి మ్యాచ్‌లు
గౌహతి: సాయంత్రం 5 గంటలకు ఫ్రాన్స్/ హోండురాస్, రాత్రి 8 గంటలకు మెక్సికో/ చిలీ.
కోల్‌కతా: సాయంత్రం 5 గంటలకు జపాన్/ న్యూ కలెడోనియా, రాత్రి 8 గంటలకు ఇంగ్లాండ్/ ఇరాక్.