క్రీడాభూమి

విమర్శించడం సులభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి విమర్శించడం చాలా సులభమని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌పై ప్రతి ఒక్కరికీ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని వ్యక్తీకరించడమేగాక, సలహాలు కూడా ఇస్తుంటారని బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకొని, సహచరులతో కలిసి ఇక్కడికి చేరుకున్న ధోనీ అన్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత్ వనే్డ సిరీస్‌ను కోల్పోయినప్పుడు ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. అతను తక్షణమే రిటైర్మెంట్ ప్రకటించాలన్న డిమాండ్ కూడా వినిపించింది. ధోనీ కెప్టెన్‌గానేగాక, ఆటగాడిగానూ పనికిరాడన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. నాటి విమర్శలను ధోనీ అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, క్రికెట్‌పై ఎవరు, ఎన్నిరకాలైన వ్యాఖ్యలైనా చేయవచ్చని, వారికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అన్నాడు. టీవీల్లో చూస్తున్నప్పుడు క్రికెట్ చాలా సులబైన ఆటగా కనిపిస్తుందని అన్నాడు. అందుకే ‘ఈ విధంగా ఆడు.. ఆ రంగా ఆడకు.. ఇలా ఉండు.. అలా ఉండకు..’ అంటూ ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తుంటారని వ్యాఖ్యానించాడు. నిజానికి మైదానంలోకి దిగి, ఆడుతున్నప్పుడు క్రకెట్ ఎంత కష్టమో అర్థమవుతుందని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ క్రికెట్ ఆడడం తనకు ఇష్టమని చెప్పాడు. ‘్భరత క్రికెటర్‌గా సేవలు అందించడమే నాకు చాలా ఇష్టం. మరే ఇతర దేశం తరఫున నేను ఆడడం లేదు’ అన్నాడు. తీవ్రమైన ఉద్వేగానికి గురికాకుండా, సాధ్యమైనంత వరకూ మధ్యే మార్గాన్ని అనుసరించాలని అతను క్రికెట్ అభిమానులకు సూచించాడు. ప్రతి విషయాన్ని విమర్శ కోణంలోనే చూడడం దురదృష్టకరమని చెప్పాడు. బంగ్లాదేశ్ చేతిలో ఓడితే అలాంటి జట్టు చేతిలో ఓడామంటూ విమర్శించిన వారే ఒకవేళ గెలిస్తే అదీ ఒక గొప్పేనా అంటూ చిన్నచూపు చూస్తారని అన్నాడు. 2004 నాటి బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు లేదని, ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లతో చాలా బలంగా ఉందని చెప్పాడు. ప్రతి మ్యాచ్ కీలకమైనదేనని, ఓడేందుకు ఎవరూ మ్యాచ్‌లు ఆడరని తెలిపాడు. టి-20 వరల్డ్ కప్‌ను సాధించే సత్తా భారత జట్టుకు ఉందని ధోనీ అన్నాడు. అన్ని విభాగాల్లోనూ జట్టు సమతూకంగా ఉందన్నాడు.
షమీకి చోటు కష్టమే!
ఫిట్నెస్ సమస్యలతో చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి టి-20 వరల్డ్ కప్ పోటీల్లో తుది జట్టులో స్థానం దక్కడం కష్టంగానే కనిపిస్తున్నది. జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రాతో పేస్ అటాక్ బలంగా ఉందని ధోనీ అన్నాడు. వీరిలో ఎవరినైనా తప్పించి షమీకి అవకాశం కల్పించడం కష్టమని స్పష్టం చేశాడు. షమీ ఫిట్నెస్ స్థాయి తనకు తెలియదని, అతను ఎలాంటి సమస్య లేకుండా మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నాడా లేదా అన్న విషయంపైనా తనకు అవగాహన లేదని చెప్పాడు. అయితే, బుమ్రా లేదా నెహ్రాను తప్పించి, షమీకి చోటు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చని అన్నాడు. హార్దిక్ పాండ్యను సమర్థుడైన ఆల్‌రౌండర్‌గా ప్రశంసించాడు. ఏ రకంగా చూసినా ప్రస్తుత జట్టు సమతూకంగానూ, బలంగానూ ఉందని పేర్కొన్నాడు.

సూర్యకుమార్ సెంచరీ

ముంబయి తొలి ఇన్నింగ్స్ 603
రెస్ట్ఫా ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్
ముంబయి, మార్చి 7: రెస్ట్ఫా ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్ తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 603 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రెస్ట్ఫా ఇండియా రెండో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది. కెఎస్ భరత్ 16 పరుగులు చేసి అవుట్‌కాగా, ఫైజ్ ఫజల్ 18, జయంత్ యాదవ్ ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ముంబయి మూడు వికెట్లకు 359 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగింది. సూర్యకుమార్ యాదవ్ 271 బంతులు ఎదుర్కొని, 24 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 156 పరుగులు సాధించాడు. ఆదిత్య తారే 65, సిద్దేష్ లాడ్ 66 చొప్పున పరుగులు చేశారు. 158.2 ఓవర్లలో ముంబయి 603 పరుగులకు ఆలౌట్‌కాగా, అప్పటికి బల్వీందర్ సింగ్ సంధు జూనియర్ ఒక పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెస్ట్ఫా ఇండియా బౌలర్లలో జయంత్ యాదవ్ 132 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనాద్కత్ 2, కృష్ణదాస్ చెరి రెండు వికెట్లు సాధించారు. కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసిన రెస్ట్ఫా ఇండియా ఇంకా 567 వెనుకంజలో ఉంది. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి.