క్రీడాభూమి

ఫ్రెంచ్ మాజీ మంత్రిపై నాదల్ దావా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 14: ఫ్రెంచ్ మాజీ మంత్రి రోసెలిన్ బాచెలట్‌పై ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ కోర్టులో దావా వేశాడు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తన పరువుకు నష్టం కలిగించిన ఆమె నుంచి 1,00,000 యూరోలు (1,18,000 డాలర్లు లేదా 73.31 లక్షల రూపాయలు) ఇప్పించాల్సిందిగా అతను కోర్టును కోరాడు. 2007 నుంచి 2010 వరకు ఫ్రెంచ్ క్రీడాశాఖ మంత్రిగా పని చేసిన బాచెలట్ గత ఏడాది మార్చిలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాదల్‌పై విమర్శలు గుప్పించింది. డోపింగ్ పరీక్షలో పట్టుబడతానన్న అనుమానంతోనే అతను 2012లో చివరి ఆరునెలలల్లో అతను కాలి గాయం పేరుతో టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడని ఆరోపించింది. నిజానికి నిషిద్ధ మాదక ద్రవ్యాలను అతను వాడాడని, డోప్ పరీక్షలో ఎక్కడ పట్టుబడతానోనన్న భయంతో గాయం నాటకం ఆడాడని విమర్శించింది. కాగా, ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన నాదల్ నష్టపరిహారం దావా వేశాడు. కోర్టులో కేసు విచారణకు వచ్చిన మొదటి రోజున వాదప్రతివాదులు నాదల్, బాచెలట్ అక్కడ లేరు. అయితే, నాదల్ తరఫులాయర్ పాట్రిక్ మైసొనెవ్ విలేఖరులతో మాట్లాడుతూ, బాచెలట్ చేసిన వ్యాఖ్యల కారణంగా నాదల్ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని అన్నాడు. ప్రస్తుత లేదా భవిష్యత్ స్పాన్సరర్లను అతను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపాడు. అందుకే దావా వేసినట్టు వివరించాడు.