క్రీడాభూమి

పాక్‌తో పోరుకు భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 14: రెండు వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత జట్టు ఇక్కడ జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉంది. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ పూల్ ‘ఎ’లో మొదటి మ్యాచ్‌ని జపాన్‌పై 5-1 తేడాతో గెల్చుకుంది. ఆతర్వాత బంగ్లాదేశ్‌ను 7-0 ఆధిక్యంతో చిత్తుచేసి సత్తా చాటింది. మరోవైపు పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, బంగ్లాదేశ్‌ను 7-0 తేడాతో ఓడించింది. అయితే, రెండో మ్యాచ్‌లో జపాన్‌ను ఢీకొని, మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి. టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న భారత్‌ను పాకిస్తాన్ సమర్థంగా నిలువరిస్తుందా అన్నది అనుమానంగానే ఉంది. అయితే, అన్ని విధాలుగా బలంగానే కనిపిస్తున్న మన్‌ప్రీత్ బృందం పెనాల్టీ కార్నర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీల్డ్ గోల్స్‌ను నమోదు చేయడంలో ముందున్న ఈ జట్టు పెనాల్టీలను అనుకున్న స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 13 పెనాల్టీలను సంపాదించింది. కానీ, వాటిలో రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలచుకోగలిగింది. ఈ లోపాన్ని సవరించుకుంటే, ప్రత్యర్థులపై విజయం భారత్‌కు మరింత సులభమవుతుంది. ఇలావుంటే, లెజెండరీ కోచ్ రోలాంట్ అల్ట్‌మన్స్ నుంచి సుమారు నెల క్రితం బాధ్యతలు స్వీకరించిన జొయెర్డ్ మరిన్‌కు కూడా ఆసియా కప్ టోర్నమెంట్ ప్రతిష్ఠాత్మకంగా మారింది. టైటిల్ ఫేవరిట్ ముద్ర వేయించుకున్నందుకు ఆటగాళ్లపై, కొత్తగా బాధ్యతలు తీసుకున్నందుకు కోచ్‌పై పరోక్షంగా ఒత్తిడి పెరుగుతున్నది. ఇక ఆదివారం నాటి మ్యాచ్ విషయానికి వస్తే, ఇది టైటిల్ పోరు కంటే ప్రాధాన్యతను సంతరించుకుంది. టోర్నీలో విజేతగా నిలిచే విషయం ఎలావున్నా, పాకిస్తాన్ చేతిలో ఓడితే మాత్రం అభిమానులు అదొక అవమానంగా భావించడం ఖాయం. పాక్ పరిస్థితి కూడా అంతే. అందుకే, ఇరు జట్లు చావో రేవో అన్న చందంగా పోటీపడతాయి. టోర్నమెంట్‌లో ఇది ఒక లీగ్ మ్యాచేగానీ, రెండు దేశాలకు ఇదే తుది పోరు స్థాయిలో ఉంటుంది. చివరి సారి ఈ రెండు జట్లు లండన్‌లో జరిగిన వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి అలాంటి ఫలితానే్న అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, జయాపజయాలు ఎలావున్నా, ప్రేక్షకులకు మాత్రం ఒక గొప్ప పోరాటాన్ని చూసే అవకాశం దక్కుతుంది.