క్రీడాభూమి

టైటిల్‌పై భారత్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల టి-20 వరల్డ్ కప్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ గ్రూపుల్లో మొదటి రెండు స్థానాలను సంపాదించిన జట్లు సెమీ ఫైనల్స్ చేరుతాయి.
టి-20 వరల్డ్ కప్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో 35 పురుషుల విభాగంలో, 23 మహిళల విభాగంలో ఉంటాయి. 27 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మ్యాచ్‌లు బెంగళూరు, చెన్నై, ధర్మశాల, కోల్‌కతా, మొహాలీ, ముంబయి, నాగపూర్, న్యూఢిల్లీ నగరాల్లో జరుగుతాయి. ఈనెల 30న న్యూఢిల్లీ, 31న ముంబయి సెమీ ఫైనల్స్‌కు ఆతిథ్యమిస్తాయి. ఏప్రిల్ 3న జరిగే ఫైనల్‌కు కోల్‌కతా వేదిక అవుతుంది.

నాగపూర్: స్వదేశంలో జరుగుతున్న టోర్నీ.. ఆపై ఇటీవల కాలంలో సాధిస్తున్న వరుస విజయాలు.. పొట్టి ఫార్మెట్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానం.. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడం.. ఇన్ని సానుకూల పరిస్థితులు ఉన్నందువల్ల మంగళవారం క్వాలిఫయర్ మ్యాచ్‌లతో ప్రారంభమయ్యే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. ట్రోఫీపై కనే్నసిన మహేంద్ర సింగ్ ధోనీ సేన తాజాగా ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించి టి-20 వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. మంగళవారం జింబాబ్వే, హాంకాంగ్ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ జరుగుతుంది. మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఢీ కొంటాయి. కాగా, క్వాలిఫయర్స్‌లో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన జట్లకు సూపర్-10లో స్థానం లభిస్తుంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లతో కలుస్తాయి. మహిళల విభాగంలో టి-20 వరల్డ్ కప్ ఈనెల 15 నుంచి 28వ తేదీ వరకు జరుగుతుంది.
‘డిఫెండింగ్’కు కష్టాలు!
డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించి పరాజయాన్ని చవిచూసిన ఆ జట్టు తాజాగా ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లోనూ దారుణంగా విఫలమైంది. ఫైనల్ చేరుకోలేక చతికిలపడింది. ఇందుకు భిన్నంగా టీమిండియా బలాన్ని పుంజుకుంటూ, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరింది. 2007లో జరిగిన మొదటి టి-20 వరల్డ్ కప్‌లో టైటిల్‌ను అందుకున్న భారత జట్టు మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉంది. విజయావకాశాలు కూడా ధోనీ సేనకే ఉన్నాయని విశే్లషకుల అభిప్రాయం. ఆసియా కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ని కూడా కోల్పోకుండా టైటిల్ సాధించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతోపాటు క్వాలిఫయర్స్ జట్టుతో కలి సి భారత్ సూపర్ 10 గ్రూప్-2 నుంచి పోటీపడుతున్నది.
కివీస్‌తో తొలి మ్యాచ్
ఈనెల 15న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టి-20 వరల్డ్ కప్‌లో భారత జట్టు తన ప్రస్థానాన్ని ఆరంభిస్తుంది. 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ధర్మశాలలో ఢీ కొంటుంది. 23న బెంగళూరులో క్వాలిఫయింగ్ జట్టును ఎదుర్కొంటుంది. 27న మొహాలీలో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
శ్రీలంక జట్టు సూపర్ 10 గ్రూప్-1 నుంచి బరిలోకి దిగనుంది. ఈ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌తోపాటు మరో క్వాలిఫయింగ్ జట్టు కూడా ఉంటుంది. ఈనెల 17న కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌లో క్వాలిఫయర్‌ను ఎదుర్కోవడం ద్వారా టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయతాన్ని ప్రారంభిస్తుంది. బెంగళూరులో 20న వెస్టిండీస్, 26న ఇంగ్లాండ్, 28న దక్షిణాఫ్రికా జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ టైటిల్‌ను 2009లో కైవసం చేసుకున్న పాకిస్తాన్ జట్టు ఈనెల 16న కోల్‌కతాలో ఒక క్వాలిఫయర్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. 19న భారత్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో తలపడుతుంది. 22న న్యూజిలాండ్, 25న ఆస్ట్రేలియా జట్లను ఎదుర్కొంటుంది.
అందరి అంచనాలను తారుమారు చేస్తూ 2010లో టైటిల్ సాధించిన ఇంగ్లాండ్ మరోసారి టైటిల్ కోసం జరిపే వేటలో భాగంగా ఈనెల 16న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. 18న దక్షిణాఫ్రికాతో, 23న క్వాలిఫయర్‌తో, 26న శ్రీలంకతో తలపడుతుంది.
వెస్టిండీస్ మొదటి మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడనుండగా, మిగతా మ్యాచ్‌ల్లో శ్రీలంక (మార్చి 20), దక్షిణాఫ్రికా (మార్చి 25), క్వాలియపర్ (మార్చి 27) జట్లతో ఢీకొంటుంది. ఇలావుంటే, పొట్టి ఫార్మెట్‌లో పట్టు సంపాదిస్తున్న ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ టి-20 వరల్డ్ కప్‌ను గెల్చుకోలేకపోయింది. ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి ఆ జట్టు ప్రయత్నించనుంది.

...................
టి-20 వరల్డ్ కప్ మొట్టమొదటిసారి భారత్‌లో జరుగుతుంది. మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో టోర్నీ ఆరంభమవుతోంది. మెయిన్ డ్రా పోటీలు 15 నుంచి మొదలవుతాయి. ఏప్రిల్ 3న ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ ఉంటుంది.