క్రీడాభూమి

శ్రీలంక సెలక్టర్లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీలంక సెలక్టర్లపై వేటు పడింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో లంక జట్టు దారుణంగా విఫలమైన కారణంగా కపిల విజెగుణవర్దన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఆగ్రహంతో ఉంది. అందుకే కమిటీని రద్దు చేసి, మాజీ బ్యాట్స్‌మన్ అరవింద డిసిల్వ నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కమిటీలో మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, మాజీ ఆటగాళ్లు రొమేష్ కలువితరణ, లలిత్ కలుపెరుమా, రంజిత్ మదురసింఘె సభ్యులుగా ఉంటారు.
మాథ్యూస్‌కు పగ్గాలు
కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు లసిత్ మలింగ ప్రకటించడంతో, అతని స్థానంలో నాయకత్వ పగ్గాలను టెస్టు, వనే్డ ఫార్మెట్స్‌లో లంక జట్టుకు సారథ్యం వహిస్తున్న ఏంజెలో మాథ్యూస్‌కే అప్పచెప్పారు. దీనితో మూడు ఫార్మెట్స్‌లోనూ అతనే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. కాగా, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పటికీ, జట్టులో సభ్యుడిగా మలింగ కొనసాగుతాడు.

స్కాట్‌లాండ్‌పై అఫ్గాన్ విజయం
నాగపూర్, మార్చి 8: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’లో జరిగిన తొలి రౌండ్ రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 14 ప రుగుల తేడాతో స్కాట్‌లాండ్‌పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కుదిగిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల కు 170 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ షెజాద్ 61 పరు గులు సాధించగా, కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జయ్ అజేయంగా 55 పరు గులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్కాట్‌లాండ్ 5 వి కెట్లకు 156 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు జార్జి మునే్స, కేల్ కోజర్ చెరి 40 పరుగులు సాధించగా, చివరిలో మాట్ మచామ్ 36 పరుగులు చేశాడు.