క్రీడాభూమి

లివర్‌పూల్ చేతిలో మారిబర్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారిబర్ (స్లొవేనియా), అక్టోబర్ 18: చాంపియన్స్ లీగ్‌లో లివర్‌పూల్ జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. మారిబర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ని 7-0 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ కొనసాగిన లివర్‌పూల్ విజృంభణకు ప్రత్యర్థి జట్టు నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడం గమనార్హం. రాబర్టో ఫర్మినో, మహమ్మద్ సలే చెరి రెండు గోల్స్ చేసి, ఈ విజయానికి బాటలు వేశారు. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే ఫర్మినో చేసిన గోల్‌తో లివర్‌పూల్ ఖాతా తెరిచింది. 17వ నిమిషంలో ఫిలిప్ కాంటిన్హో గోల్ చేయగా, మరో రెండు నిమిషాల్లోనే సలే ద్వారా మూడో గోల్ లభించింది. ఆతర్వాత కొంత సేపు రక్షణాత్మకంగా ఆడినప్పటికీ, 40వ నిమిషంలో సలే మరోసారి ప్రత్యర్థి డిఫెన్స్‌పై దాడి చేసి, విజయవంతంగా గోల్ సాధించాడు. 64వ నిమిషంలో ఫర్మినో, 86వ నిమిషంలో అలెక్స్ అక్స్‌లాడ్ చాంబర్‌లైన్ గోల్స్ చేయగా, చివరి క్షణాల్లో ట్రెంట్ అలెగ్జాండర్ ఆర్నాల్డ్ గోల్ చేసి, మ్యాచ్‌కి గొప్ప ముగింపునిచ్చాడు.
ఆదుకున్న రొనాల్డో
సూపర్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఆదుకోవడంతో, టోటెన్హామ్ హాట్స్‌పార్‌తో జరిగిన మ్యాచ్‌ని రియల్ మాడ్రిడ్ డ్రా చేసుకోగలిగింది. నిజానికి ఈ మ్యాచ్‌లో టొటెన్హామ్ ప్రతిభ కంటే స్వయం కృతంతోనే రియల్ మాడ్రిడ్ సమస్యల్లో పడింది. నాకౌట్‌కు చేరేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో, టొటెన్హామ్‌తో గ్రూప్ మ్యాచ్‌ని రియల్ మాడ్రిడ్ ప్రాక్టీస్ సెషన్‌గా వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ వూహ్యంతోనే ఆటను కొనసాగించింది. అయితే, 28వ నిమిషంలో రాఫెల్ వరాన్ ఓన్ గోల్ చేసి, ప్రత్యర్థి జట్టు టొటెన్హామ్ ఖాతాను తెరిచాడు. అయాచితంగా గోల్‌ను ధారాదత్తం చేసిన తర్వాత, ఈక్వెలైజర్ కోసం రియల్ మాడ్రిడ్ శ్రమించింది. 43వ నిమిషంలో రొనాల్డో కీలక గోల్ చేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత డిఫెన్స్‌కు పరిమితమై మ్యాచ్‌ని డ్రాగా ముగించింది.
ప్రొమెస్ ‘డబుల్’
క్వెన్సీ ప్రొమెస్ రెండు గోల్స్ చేయడంతో, సెవిల్లాతో జరిగిన మ్యాచ్‌లో స్పార్టాక్ మాస్కో జట్టు 5-1 తేడాతో విజయభేరి మోగించింది. 10వ నిమిషంలో తొలి గోల్ చేసిన ప్రొపెస్, మ్యాచ్ చివరి క్షణంలో మరో గోల్ చేశాడు. లొరెన్జో మెల్గారెజో (58వ నిమిషం), డెనిస్ గ్లాషకొవ్ (67వ నిమిషం), లూయిజ్ ఆడ్రియానో (74వ నిమిషం) తలా ఒక్కో గోల్ చేశారు. సెవిల్లా తరఫున సిమోన్ జార్ ఒక గోల్ సాధించాడు.
ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే, పటిష్టమైన నపోలీపై మాంచెస్టర్ సిటీ 2-1 తేడాతో గెలిచింది. రహీం స్టెర్లింగ్ 9, గాబ్రియల్ జీసస్ 13 నిమిషాల్లో మాంచెస్టర్ సిటీకి గోల్స్ అందించగా, నపోలీ ఆటగాడు అమాడొ డియావరా 73వ నిమిషంలో గోల్ చేశాడు. కాగా, ఫెయెనూర్డ్‌తో జరిగిన మ్యాచ్‌ని షక్టర్ డొనెస్ట్ 2-1 తేడాతో గెల్చుకుంది. ఆర్‌బి లీప్‌జింగ్ 3-2 తేడతో పోర్టోను ఓడించింది. మోనాకోపై బెసిటాస్ 2-1 ఆధిక్యంతో విజయం సాధించింది. అపొయెల్, బొరుసియా డార్ట్‌మండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి. ఇలావుంటే, ఈ టోర్న మెంట్‌లో ఆధిపత్యం కోసం దాదాపు అన్ని జట్లు తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో, ప్రతి మ్యా చ్ ఒక ఫైనల్‌ను తలపిస్తున్నది. అయతే, రియల్ మాడ్రిడ్ మిగతా జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉం ది. ఈసారి టైటిల్‌ను దక్కించుకునే అవకాశాలు ఆ జట్టుకే ఎక్కువగా ఉన్నాయ.