క్రీడాభూమి

క్వార్టర్స్ చేరిన ఘనా, బ్రెజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీ ముంబయి, అక్టోబర్ 18: అండర్-17 వరల్డ్ కప్‌లో ఘనా, బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో నిగెర్‌ను ఘనా 2-0 తేడాతో ఓడించింది. మొట్టమొదటిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతూ ప్రీ క్వార్టర్స్ చేరడం ద్వారా సంచలనం సృష్టించిన నిగెర్ అదే స్థాయిలో ఆడలేక, ఇంటిదారి పట్టింది. ఇక్కడి డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో నిగెర్ గట్టిపోటీని ఇవ్వడంతో, గోల్స్ కోసం ఘనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథమార్ధం ముగింపు దశకు చేరుకున్నప్పుడు, ఎరిక్ అయా ద్వారా ఆ జట్టు తొలి గోల్‌ను సంపాదించింది. ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని సంపాదించిన వెంటనే, ద్వితీయార్ధంలో మరోసారి డిఫెన్స్ వ్యూహాన్ని అనుసరించిన ఘనాను నిగెర్ దెబ్బతీయలేకపోయింది. మ్యాచ్‌లో మరో గోల్ నమోదయ్యే అవకాశం లేదని అంతా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే, మ్యాచ్ చివరి క్షణంలో రిచర్డ్ కాన్సో గోల్ చేసి, ఘనాను 2-0 తేడాతో గెలిపించాడు. ఈ జట్టు క్వార్టర్స్‌లో మాలీని ఢీ కొంటుంది.
హోండురాస్ ఇంటికి
ఈ టోర్నమెంట్‌లో జెయింట్ కిల్లర్ అనే ముద్ర వేయించుకున్న హోండురాస్ ఇంటిదారి పట్టింది. ప్రీ క్వార్టర్స్‌లో ఈ జట్టు 0-3 తేడాతో బ్రెజిల్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ 11వ నిమిషంలోనే బ్రెజిల్‌కు బ్రెన్నర్ ద్వారా గోల్ లభించింది. మొదటి గోల్ తర్వాత కొంత నెమ్మదించిన బ్రెజిల్ క్రమంగా తనదైన పంథాను అనుసరించింది. దీనితో 44వ నిమిషంలో రెండో గోల్ చేసింది. దీనిని మార్కొస్ ఆంటానియో సాధించాడు. అదే దూకుడును కొనసాగించిన బ్రెజిల్‌కు 56వ నిమిషంలో బ్రెన్నర్ రెండవ, మొత్తం మీద మూడో గోల్‌ను అందించాడు. ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన హోండురాస్ నిష్క్రమించగా, బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది.