క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ జింబాబ్వే బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’లో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హాంకాంగ్‌ను ఢీకొన్న ఈ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఉసు సిబాండ (56) అర్ధ శతకంతో రాణించగా, ఎల్టన్ చిగుంబురా (30 నాటౌట్), మాల్కం వాలెర్ (26), హామిల్టన్ మసకజా (20) కూడా జట్టు స్కోరును పెంచేందుకు తమ వంతు కృషి చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ విజయం కోసం చివరి వరకూ పోరాడింది. అయితే వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమై, 20 ఓవర్లలో ఆ వికెట్లకు 144 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ జెమీ అట్కిన్సన్ (53) అర్ధ శతకాన్ని నమోదు చేయగా, కెప్టెన్ తన్వీర్ అఫ్జల్ అజేయంగా 31 పరుగులు చేశాడు. మిగతా వారు పరుగుల వేటలో విఫలమయ్యారు.
ర్యాన్ రికార్డు
హాంకాంగ్ ఓపెనర్ ర్యాన్ క్యాంప్‌బెల్ మంగళవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆడడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఆడిన ఎక్కువ వయసుగల ఆటగాడిగా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. 44 ఏళ్ల ర్యాన్ గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఆటగాడు తాకిర్ రికార్డును తిరగరాశాడు. తాకిర్ తన 43 ఏళ్ల 179 రోజుల వయసులో టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఆ రికార్డును ర్యాన్ అధిగమించాడు. ఫీ ల్డిం గ్‌లో చాలా చురుగ్గా కదులుతూ, జింబాబ్వే బ్యాట్స్‌మన్ సికందర్ రజాను ర్యాన్ రనౌట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

టి-20 వరల్డ్ కప్ మొదటి క్వాలిఫయర్‌కు టాస్