క్రీడాభూమి

మెక న్రోను గుర్తు తెస్తున్నాడు: కపిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ తనకు టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోను గుర్తుతెస్తున్నాడని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. మెకెన్రో తరచు ప్రత్యర్థి ఆటగాళ్లతో, అంపైర్లతో ఘర్షణకు దిగేవాడని అన్నాడు. ఈ విధంగా సవాళ్లు విసురుతూ, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళ్లడం వల్ల ఆట కొత్తపుంతలు తొక్కుతుందని అన్నాడు. కోహ్లీ ప్రతిభావంతుడనడంలో ఎలాంటి పొరపాటు లేదని అయతే, అతనిని టి-20, వనే్డ ఫార్మెట్స్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చవద్దని అభిమానులకు కపిల్ సూచించాడు. ధోనీ మైదానంలో ఎప్పుడూ నింపాదిగా ఉంటాడని, కోహ్లీ దూకుడుగా వ్యవహరిస్తాడని చెప్పాడు. ఆయా పరిస్థితులను బట్టి ఏ విధానం సరైనదనే విషయం స్పష్టమవుతుందని అన్నాడు. కోహ్లీ కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడని, ఇప్పుడే అతనిని ధోనీతో పోల్చడం సరికాదని అన్నాడు. మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించారని కపిల్ అన్నాడు. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడులకు ఉపక్రమించడం, వీరబాదుడుతో డబుల్, ట్రిపుల్ లేదా క్వార్టిపుల్ సెంచరీలు సాధించడం ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్‌కు అలవాటు లేదని అతను విమర్శించినట్టు వచ్చిన వార్తలను అతను ఖండించాడు. తాను సచిన్ సామర్థ్యాన్ని శంకించేలా ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదని కపిల్ స్పష్టం చేశాడు. సచిన్‌కు ఇంకా ఎక్కువ పరుగులు సాధించగల సామర్థ్యం ఉందని మాత్రమే తాను అన్నట్టు చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తమ తరం బ్యాట్స్‌మెన్‌లో రిచర్డ్స్‌ను అసాధారణ ప్రతిభావంతుడిగా అభివర్ణించాడు. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ఆఫ్ స్టంప్ వైపు వేసిన బంతిని కూడా లెగ్ సైడ్‌లో బౌండరీకి తరలించే సత్తా అతనికి మాత్రమే ఉండేదని అన్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో రిచర్డ్స్ ఆడిన తీరును గుర్తు చేశాడు. టెయిలెండర్ మైఖేల్ హోల్డింగ్‌తో కలిసి రిచర్డ్స్ స్కోరును పెంచాడని అన్నాడు. విండీస్‌కు 200 పరుగులు జత కలిపి, 189 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడని అన్నాడు. సంప్రదాయ సిద్ధమైన బ్యాటింగ్ అతనికి తెలియదని అంటూ, బహుశా క్రికెట్‌లో బ్యాటింగ్ టెక్నిక్స్‌పై ఉన్న పుస్తకాలను అతను చదివి ఉండడని చమత్కరించాడు. భారత జట్టు ఎంతో బలంగా ఉందని, టి-20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటుందని కపిల్ ధీమా వ్యక్తం చేశాడు.