క్రీడాభూమి

ధోనీ సిక్సర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: ధోనీ ఫామ్‌లో ఉంటే, సిక్సర్ల వర్షం కురిపిస్తాడన్నది అందరికీ తెలిసిన విషయమే. వాంఖడే స్టేడియంలో శనివారం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ అతను భారీ సిక్సర్లు కొట్టాడు. వనే్డ కెరీర్‌లో 213 సిక్సర్లు బాదిన అతనికి 2011 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై సంధించిన సిక్సర్ ఎనలేని పేరుప్రఖ్యాతులను ఆర్జించి పెట్టింది. ఆ సిక్సర్ భారత్‌కు వరల్డ్ కప్‌ను అందించడమే అందుకు కారణం. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మొదటి వనే్డలో ధోనీ ఏ విధంగా చెలరేగుతాడో చూడాలి. నెట్స్‌లో మాత్రం అతను బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తే, న్యూజిలాండ్ బౌలర్లకు సమస్యలు తప్పవు.

చిత్రం..నెట్ ప్రాక్టీస్‌కు వెళుతున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ