క్రీడాభూమి

భారత్ చేతిలో మళ్లీ పాక్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 21: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరిట్‌గా ముద్ర వేయించుకున్న భారత జట్టు మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. ఈ సూపర్ ఫోర్స్ (సెమీ ఫైనల్) మ్యాచ్‌లో భారత్ సర్వశక్తులు కేంద్రీకరించి, పాక్‌పై విజయమే ప్రధాన లక్ష్యంగా పోరాడింది. ఇరు జట్లు ఒకరి అవకాశాలను మరొకరు అడ్డుకుంటూ ముందుకు సాగడంతో, మ్యాచ్ మొదటి రెండు క్వార్టర్స్‌లోనూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే, 39వ నిమిషంలో ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకు దూసుకెళ్లిన సత్బీర్ సింగ్ చక్కటి గోల్ చేశాడు. మ్యాచ్ మూడో క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి క్వార్టర్‌లో భారత్ విజృంభణకు పాక్ నుంచి సరైన సమాధానం లేకపోయింది. 52వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ గోల్ సాధించగా, మరో నిమిషంలోనే హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేసి, భారత్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. 57వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 4-0 తేడాతో మ్యాచ్‌ని ముగించి, ఫైనల్ చేరింది. గ్రూప్ దశలో ఒకసారి పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. పసలేని పాక్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు.