క్రీడాభూమి

ఫైనల్‌కు శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెన్స్, అక్టోబర్ 21: కిడాంబి శ్రీకాంత్ కెరీర్‌లో మరో టైటిల్ దిశగా ముందడుగు వేశాడు. ఇక్కడ జరుగుతున్న డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో అతను వాంగ్ వింగ్ కి వినె్సంట్‌పై 21-18, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న శ్రీకాంత్ అదే దూకుడును కొనసాగిస్తూ, ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కనబరిచాడు. వినె్సంట్ గట్టిపోటీని ఇవ్వడానికి శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, టైటిల్ కోసం లీ హ్యున్ లితో శ్రీకాంత్ ఢీ కొంటాడు. రెండో సెమీ ఫైనల్‌లో హ్యున్ లి 25-23, 18-21, 21-17 ఆధిక్యంతో టాప్ సీడ్ సొన్ వాన్ హోను ఓడించి ఫైనల్ చేరాడు. కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో లీ చెంగ్, జాంగ్ నాన్ జోడీతో మార్కస్ ఫెర్నాల్డీ గిడియన్, కెవిన్ సంజయ సుకముటో జోడీ ఫైనల్‌లో తలపడుతుంది. సెమీ ఫైనల్‌లో గిడియన్, సుకముటో 21-18, 21-11 తేడాతో రికీ కరాండ సువార్డీ, అన్గా ప్రతామా జోడీపై గెలిచారు. అదే విధంగా చెంగ్, నాన్ జోడీ 21-18, 18-21, 21-13 ఆధిక్యంతో మథియాస్ బొయే, కార్‌స్టెన్ మొగెనె్సన్ జోడీని ఓడించి ఫైనల్ చేరింది.
మహిళల సింగిల్స్‌లో అతానే యమాగుచీ, రచానొక్ ఇంతనాన్ టైటిల్ కోసం పోరాడతారు. మొదటి సెమీ ఫైనల్‌లో అతానే 10-21, 21-18, 21-19 స్కోరుతో చెన్ యుఫెయ్‌ని ఓడించింది. మరో సెమీ ఫైనల్‌లో ఇంతనాన్ 21-14, 20-22, 21-14 స్కోరుతో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మహిళల డబుల్స్ ఫైనల్‌లో షిహో తనాకా, కొహారు యోనెమోటో జోడీని లీ సొ హీ, షిన్ సియాంగ్ చాన్ జోడీ తలపడుతుంది. తనాకా, యోనెమోటో 21-9, 22-20 ఆధిక్యంతో జాంగ్ యే నా, జంగ్ క్యుంగ్ ఇన్ జోడీపై గెలిచారు. రెండో సెమీ ఫైనల్‌లో సొ హీ, సియాంగ్ చాన్ జోడీ 21-16, 14-21, 21-14 ఆధిక్యంతో నవోకో ఫకానన్, కురుమీ యనావో జోడీపై విజయం సాధించింది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తాంగ్ చున్ మాన్, సే ఇంగ్ సయెట్ జోడీతోపాటు జెంగ్ సివెయ్, చెన్ క్వింగ్‌చెన్ జోడీ ఫైనల్ చేరింది. మొదటి సెమీ ఫైనల్‌లో చున్ మాన్, ఇంగ్ సయెట్ 21-16, 21-18 స్కోరుతో టాన్‌టోవీ అహ్మద్, లిలియానా నాట్సిర్ జోడీని ఓడించారు. మరో సెమీ ఫైనల్‌లో జెంగ్ సివెయ్, కింగ్‌చెన్ జోడీ 21-16, 21-16 స్కోరుతో గో సాన్‌హువాట్, షెవాన్ జెమీ లాయ్ జోడీపై గెలిచి ఫైనల్ చేరింది.

చిత్రం..కిడాంబి శ్రీకాంత్