క్రీడాభూమి

ఫిట్నెస్‌పై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెన్స్, అక్టోబర్ 23: ఫిట్నెస్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని, అందుకే, వచ్చే సీజన్‌లో ఎంపిక చేసిన టోర్నీల్లో మాత్రమే ఆడతానని భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఆదివారం జరిగిన డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో లీ హ్యున్‌ను 2-10, 21-5 తేడాతో చిత్తుచేసి టైటిల్ అందుకున్న అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాలి గాయం నుంచి కోలుకొని మళ్లీ అంతర్జాతీయ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తన ప్రయాణం అద్భుతంగా కొనసాగుతున్నదని చెప్పాడు. ఈ ఏడాది తనకు కెరీర్‌లో గుర్తుండిపోయే చిరస్మరణీయ విజయాలు లభించాయన్నాడు. వచ్చే సీజన్‌లో తాను సుమారు పది టోర్నమెంట్స్ ఆడతానని అన్నాడు. ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకునే ఉద్దేశంతో ప్రతి టోర్నమెంట్‌కూ హాజరుకావాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు. వాటితోపాటు కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పాల్గొంటానని చెప్పాడు. దేశంలో జరిగే సయ్యద్ మోదీ ఓపెన్‌లో తప్పక ఆడాల్సి ఉంటుందని గుర్తుచేశాడు. ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లోనూ బరిలోకి దిగుతానని పేర్కొన్నాడు. మొత్తం మీద వచ్చే ఏడాది 15 నుంచి 17 టోర్నీల్లో ఆడే అవకాశాలున్నాయని తెలిపాడు. డెన్మార్క్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ ఏడాది ఇండోనేషియా ప్రీమియర్ సూపర్ సిరీస్, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ టైటిళ్లను కూడా సాధించిన శ్రీకాంత్ అన్నాడు. కల ఫలించిందనే మాటను ఉపయోగించలేనని, ఎందుకంటే, ఒకే ఏడాది మూడు టైటిళ్లు గెలుస్తానని అసలు ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించాడు. 2014లో చైనా ఓపె, 2015లో ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లను అందుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ ఏడాది మూడు టోర్నీల్లో విజేతగా నిలవడం అరుదైన అనుభూతినిస్తున్నదని తెలిపాడు. దుబాయ్ సూపర్ సిరీస్ గురించి ప్రస్తావించగా, ముందుగా చైనా, హాంకాంగ్ టోర్నీల్లో ఆడాల్సి ఉందన్నాడు. ఆతర్వాతే దుబాయ్ సూపర్ సిరీస్ గురించి ఆలోచిస్తానని అన్నాడు. ఆ టోర్నీలో 2014లో సెమీస్ చేరిన శ్రీకాంత్ 2015లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. దీనిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు కొత్త టోర్నీనే ఉంటుందని, అంతకు జరిగిన మ్యాచ్ సిరీస్‌లు, వాటి ఫలితాలను గురించి ఆలోచించే అవసరం ఉండదని వ్యాఖ్యానించాడు.

చిత్రం..కిడాంబి శ్రీకాంత్