క్రీడాభూమి

టి-20 జట్టులో సిరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: హైదరాబాద్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు భారత టి-20 జట్టులో చోటు లభించింది. అదే విధంగా శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌తోపాటు శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు జాతీయ సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు జట్టులోకి మురళీ విజయ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి కోరుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, సెలక్టర్ల ఎంపిక అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. కానీ, రొటేషన్ విధానాన్ని అమలు చేస్తామని, కాబట్టి, శ్రీలంకతో చివరి టెస్టులో కోహ్లీ ఆడకపోవచ్చని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు. దక్షిణాఫ్రికాతో కష్టతరపైన సురీస్ ఉన్నందున, అంతకంటే ముందుగా న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగే సిరీస్‌ల్లో ప్రయోగాలు చేస్తున్నట్టు ప్రసాద్ చెప్పాడు. ఇలావుంటే, విజయ్ గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్నప్పుడు టీమిండియా టెస్టు ఇన్నింగ్స్‌ను అభినవ్ ముకుంద్ మొదలుపెట్టాడు. ఇప్పుడు విజయ్ ఫిట్నెస్‌తో ఉండడంతో, ముకుంద్‌ను సెలక్టర్లు పక్కనపెట్టారు. ముందుగా ఊహించిన విధంగానే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు టెస్టు జట్టులో స్థానం లభించింది. వీరితోపాటు కుల్దీప్ యాదవ్ మూడో స్పెషలిస్టు స్పిన్నర్‌గా జట్టులో ఉంటాడు. పేస్ విభాగానికి వస్తే, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ తిరిగి టెస్టు జట్టులోకి వచ్చారు. అదే విధంగా టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిన చటేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహాకు కూడా చోటు లభించింది.
న్యూజిలాండ్‌తో టి-20 సిరీస్‌కు భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆశిష్ నెహ్రా (కేవలం ఒక మ్యాచ్‌కి మాత్రమే).
శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు టీమిండియా ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేష్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇశాంత్ శర్మ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న 23 ఏళ్ల సిరాజ్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్ ‘ఎ’ జట్టులో కీలక భూమిక పోషించాడు. న్యూజిలాండ్ ‘ఎ’పైన కూడా అతను రాణించాడు. నిలకడగా ఆడుతున్నందున అతనిప సెలక్టర్లు నమ్మకం ఉంచారు.

చిత్రం..మహమ్మద్ సిరాజ్‌