క్రీడాభూమి

వేదిక మార్పుతో నష్టమేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ని ధర్మశాల నుంచి కోల్‌కతాకు మార్చినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మ్యాచ్‌ని మరో వేదికకు మార్చేందుకు అంగీకరించామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆటగాళ్లందరిపైనా నిఘా ఉంటుందన్నాడు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి ఆరోపణలకు తావులేని విధంగా టోర్నీ జరుగుతుందని అన్నాడు.
చెమటోడ్చి గెలిచిన బంగ్లాదేశ్
ధర్మశాల, మార్చి 9: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌ని బంగ్లాదేశ్ అతి కష్టం మీద 8 పరుగుల తేడాతో గెల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ 83 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో టిన్ వాన్ డెర్ గార్టెన్ 21 పరుగులకు మూడు, పాల్ వాన్ మీకెరెన్ 17 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ చివరి వరకూ పోరాడింది. అయితే, 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ స్టీఫెన్ మైబర్, పీటర్ బోరెన్ చెరి 29 పరుగులు సాధించారు. బెన్ కూపర్ 20 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లు అల్ అమీన్ హొస్సేన్, షకీబ్ అల్ హసన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
ఉత్కంఠ పోరులో
ఒమాన్ గెలుపు
అత్యంత ఉత్కంఠ భరితంగా సా గిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై రెండు వికె ట్ల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ 5 వికెట్లకు 154 పరుగులు సాధించగా, అందుకు సమాధానం గా ఒమాన్ 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయ 157 పరుగులు చే సి గెలిచింది.