క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ (అమెరికా): ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారుడు ఆండీ ముర్రేకు ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ టెన్నిస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఫెడెరికో డెల్బోసిస్‌ను ఢీకొన్న అతను 4-6, 6-4, 6-7 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలో పాల్గొంటున్న డెల్బోసిస్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో మిలోస్ రవోనిక్‌ను ఢీకొన్న బెర్నార్డ్ టోమిక్ మొదటి సెట్‌ను 2-6 తేడాతో కోల్పోయాడు. రెండో సెట్‌లో 0-3 తేడాతో వెనుకంజలో ఉన్న సమయంలో గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. రవోనిక్ రెండో రౌండ్ చేరాడు. డేవిడ్ గోఫిన్ 4-6, 6-3, 6-2 ఆధిక్యంతో గడో పెల్లాను, రిచర్డ్ గాస్క్వెట్ 2-6, 6-2, 6-1 స్కోరుతో అలెగ్జాండర్ డొల్గొపొలొవ్‌ను ఓడించారు. మారిన్ సిలిక్ 6-4, 6-3 ఆధిక్యంతో లియోనార్డో మెయర్‌పై గెలుపొందాడు. థామస్ బెర్డిచ్ 6-1, 7-6 తేడాతో బొర్న్ కొరిక్‌పై విజయం సాధించాడు. గేల్ మోన్ఫిల్ 6-1, 6-3 తేడాతో అల్బర్ట్ రొమోవినొలాస్‌ను, స్టానిస్లాస్ వావ్రిన్కా 6-4, 7-6 తేడాతో ఆండ్రె కెర్జెనెత్సొవ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించారు.
ప్రీ-క్వార్టర్స్‌కు అజరెన్కా
పరిబాస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెన్కా ప్రీ క్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్‌లో ఆమె షుయ్ జాంగ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి, క్వార్టర్స్‌లో స్థానం కోసం సమంతా స్టొసుర్‌తో పోరును ఖరారు చేసుకుంది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో స్టొసుర్ 6-4, 2-6, 6-4 స్కోరుతో క్రిస్టినా మెక్‌హాలెపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో మగ్దలీన రెబరికొవా 6-4, 3-6, 6-3 తేడాతో బెలిండా బెన్సిక్‌ను, కరోలినా ప్లిస్కోవా 6-2, 6-0 ఆధిక్యంతో అనా ఇవానోవిచ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల విభాగంలో ఆండీ ముర్రే అనూహ్యంగా ఓటమిపాలుకాగా, జొహానా కొన్టా 6-4, 6-1 తేడాతో దనిరా అలెస్టొవాను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు చేరడం ద్వారా బ్రిటన్ అభిమానులకు ఊరటనిచ్చింది. రాబర్టా విన్సీ 6-1, 6-3 తేడాతో ఎలినా స్విటోలినాపై గెలవగా, డయా కొసట్కినా 6-4, 3-6, 7-6 తేడాతో మోనికా పగ్‌పై విజయం సాధించింది.

మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్

బంగ్లాదేశ్‌పై భారత్ విజయభేరి

బెంగళూరు, మార్చి 15: మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన మహిళల టి-20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్‌ను విజయపథంలో నడిపింది. ఆమె 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ వేగంగా పరుగులు రాబట్టి భారత్ విజయంలో తన వంతు పాత్రను పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. మిథాలీ 35 బంతుల్లో 42 పరుగులు చేసింది. ఇందులో ఐదు ఫోర్లు ఉన్నాయి. వెల్లస్వామి వనిత 38 పరుగులు సాధించగా, హర్మన్‌ప్రీత్ 29 బంతుల్లోనే, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసింది. వేదా కృష్ణమూర్తి 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫాతిమా ఖటూన్, రెహానా అహ్మద్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
భారత్‌ను ఓడించి, ఈటోర్నీలో శుభారంభం చేసేందుకు 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకొని 91 పరుగులు చేయగలిగింది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ, దాడికి ఉపక్రమించకుండా తాత్సారం చేసినందుకు బంగ్లాదేశ్ తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. షర్మిన్ అక్తర్ (21), వికెట్‌కీపర్ నిగర్ సుల్తానా (27 నాటౌట్) కొంత సేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. రన్‌రేట్ పెంచడంలో విఫలమైన బంగ్లాదేశ్ బ్యాట్స్‌విమెన్ జట్టు ఓటమికి కారణమయ్యారు. భారత్ బౌలర్లు అనుజా పాటిల్, పూనమ్ యాదవ్ చెరి రెండు వికెట్లు పడగొటాటరు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 (మిథాలీ రాజ్ 42, వనిత 38, హర్మన్‌ప్రీత్ కౌర్ 40, వేదా కృష్ణమూర్తి 36 నాటౌట్, ఫాతిమా ఖటూన్ 2/31, రెహానా అహ్మద్ 2/35).
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 91 (షర్మిన్ అక్తర్ 21, నిగర్ సుల్తానా 27 నాటౌట్, ఫాతిమా ఖటూన్ 14, జహానా ఆలమ్ 10, అనుజా పాటిల్ 2/16, పూనమ్ యాదవ్ 2/17).