క్రీడాభూమి

ఎదురుదాడి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: ఒక మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన అదే ఫలితాన్ని గురించి ఆలోచించడం వల్ల లాభం ఉండదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొని ఓడిన విషయం తెలిసిందే. కివీస్‌ను 127 పరుగులకే కట్టడి చేసినప్పటికీ, బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలం కావడంతో భారత్ 79 పరుగుకే ఆలౌటైంది. ఈ ఫలితంపై ఒక ఇంటర్వ్యూలో ధోనీ స్పందిస్తూ, ఎదురుదాడికి దిగే సత్తా తమకు ఉందని చాలా సందర్భాల్లో రుజువైందని చెప్పాడు. ఈనెల 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అంతర్జాతీయ టోర్నీల్లో ప్రతి మ్యాచ్‌కీ ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నాడు. మిగతా మూడు గ్రూప్ మ్యాచ్‌లను గెల్చుకోకపోతే టీమిండియా ముందంజ వేసే అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని ధోనీ తోసిపుచ్చాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత మరో రెండు మ్యాచ్‌లను ఆడతామని చెప్పాడు. అయితే, ప్రతి మ్యాచ్‌నీ ఎంతో కీలకమైనదిగానే భావిస్తున్నామని అన్నాడు.
వ్యూహం సరైనదే!
జట్టు కూర్పుపై తాము అనుసరించిన వ్యూహం సరైనదేనని ధోనీ సమర్థించుకున్నాడు. స్పిన్నర్ పవన్ నేగీని తుది జట్టులోకి తీసుకోకపోవడం వల్ల నష్టం జరిగిందా అన్న ప్రశ్నకు లేదని సమాధానం చెప్పాడు. యువరాజ్ సింగ్‌కే బౌలింగ్ చేసే అవకాశం లభించలేదని, ఇక వేయడానికి ఓవర్లు ఎక్కడ మిగులుతాయని ప్రశ్నించాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారా అని ప్రశ్నించగా, ఇది కేవలం ఆటగాళ్లకేగాక అభిమానులకు కూడా పాఠాలు నేర్పిందని వ్యాఖ్యానించాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుస్తామని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ధీమా వ్యక్తం చేశాడు.

సిసి కెమెరాల్లో సుఖ్వీందర్ హత్య దృశ్యాలు
రోహ్తక్, మార్చి 16: కబడ్డీ క్రీడాకారుడు సుఖ్వీందర్ నర్వాల్‌ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి హత్య చేసిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని ఒక ఇంటికి భద్రత కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో లభించాయి. మూడు నెలల క్రితం హర్యానాలో రోహ్తక్ సమీపంలోని తన గ్రామంలోనే దీప్ కుమార్ అనే కబడ్డీ ఆటగాడిని మోటార్ సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. తాజాగా మరో కబడ్డీ ఆటగాడు సుఖ్వీందర్ తుపాకీ గుళ్లకు బలయ్యాడు. అతను ప్రాక్టీస్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కెమెరాల్లో లభించిన ఫుటేజీలను బట్టి సెల్‌ఫోన్‌లో ఎవరితోనూ మాట్లాడుతూ నడుస్తున్న సుఖ్వీందర్‌ను ఒక స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు తుపాకీతో కాల్చారు. తలపై పదేపదే తూటాల వర్షం కురిపించారు. మొదటి గుండు తగిలిన తర్వాత కింద పడిన సుఖ్వీందర్ మెల్లిగా లేచి నిలబడేందుకు ప్రయత్నించి, అక్కడే కుప్పకూలినట్టు సిసి కెమెరా దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. కింద పడిన అతనిపై కాల్పులు జరిపి, చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత వారిద్దరూ స్కూటర్ ఎక్కి వెళ్లిపోయారు. దీపక్ కుమార్ హత్య జరిగి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయని రోహ్తక్ పో లీసులు సుఖ్వీందర్ కేసులో పురోగవృద్ధి సాధిస్తారో లేదో చూడాలి.