క్రీడాభూమి

అఫ్రిదీ ఆల్‌రౌండ్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షహీద్ అఫ్రిదీ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును గెలిపించాడు. అహ్మద్ షెజాద్, మహమ్మద్ హఫీజ్ అర్ధ శతకాలు కూడా జట్టు విజయానికి బాటలు వేశాయి. పాక్ నిర్ధారించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 26 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను షర్జీల్ ఖాన్ (18) రూపంలో కోల్పోయినప్పటికీ ఆతర్వాత అహ్మద్ షెజద్, మహమ్మద్ హఫీజ్, అఫ్రిదీ వీరవిహారం కారణంగా కోలుకోవడమేగాక, భారీ స్కోరు దిశగా ముందుకు సాగింది. రెండో వికెట్‌కు హఫీజ్‌తో కలిసి 95 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన షెజాద్‌ను మహమ్మదుల్లా క్యాచ్ పట్టగా సబ్బీర్ రహ్మాన్ అవుట్ చేశాడు. అతను 39 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లతో 52 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్ హఫీజ్ 42 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 64 పరుగులు చేసి అరాఫత్ సన్నీ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు దొరికిపోయాడు. ఉమర్ అక్మల్ పరుగుల ఖాతాను తెరవకుండానే పెవిలియన్ చేరగా, ధాటిగా ఆడిన అఫ్రిదీ వేగంగా 49 పరుగులు చేశాడు. 19 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతని స్కోరులో నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. చివరిలో షోయబ్ మాలిక్ 15 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మరో నాటౌట్ బ్యాట్స్‌మన్ ఇమాద్ వసీం ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు.
బంగ్లాదేశ్ తడబాటు
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమన్న అభిప్రాయం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో ప్రారంభం నుంచే కనిపించింది. ఫలితంగా పరుగుల వేటలో తడబడ్డారు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నంలో పడిపోయిన వారు రన్‌రేట్‌పై దృష్టి పెట్టలేదు. షకీబ్ అల్ హసన్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకోవడానికి కృషి చేశాడు. కానీ, అతని శ్రమ ఫలించలేదు. మరో 4 వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ, వేగంగా పరుగులు సాధించలేకపోయిన బంగ్లాదేశ్ ఓవర్ల కోటా పూర్తయ్యే సమయానికి 6 వికెట్లకు 146 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లు అఫ్రిదీ, మహమ్మద్ అమీర్ చెరి 27 పరుగులిచ్చి, రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచిన అఫ్రిదీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 (అహ్మద్ షెజాద్ 52, మహమ్మద్ హఫీజ్ 64, షహీద్ అఫ్రిదీ 49, తస్కిన్ అహ్మద్ 2/32, అరాఫత్ సన్నీ 2/34).
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 (షకీబ్ అల్ హసన్ 50 నాటౌట్, సబ్బీర్ రహ్మాన్ 25, తమీమ్ ఇక్బాల్ 24, మహమ్మద్ అమీర్ 2/27, అఫ్రిదీ 2/27).