క్రీడాభూమి

దమ్ములేని ఐసిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 11: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణికి, తీసుకుంటున్న ఇష్టానుసార నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పూర్తిగా విఫలమైందని పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రం ధ్వజమెత్తాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడేలా బిసిసిఐని ఒప్పించే దమ్ము ఐసిసికి లేదని స్పష్టమవుతున్నదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శించాడు. 2014లో కుదిరిన ఒప్పందం ప్రకారం, 2015-2023 మధ్యకాలంలో రెండు దేశాల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సి ఉందని గుర్తుచేశాడు. అయితే, పాక్‌తో సిరీస్‌లకు భారత్ నిరాకరిస్తున్నదని, ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని అన్నాడు. నష్టపరిహారం కోసం వేసిన పిటిషన్‌ను కూడా బిసిసిఐ పట్టించుకోవడం లేదన్నాడు. రాజకీయ కారణాలతోనే ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత్ సానుకూలంగా స్పందించడం లేదని అన్నాడు. అయితే, క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం సమంజసం కాదని అక్రం హితవు పలికాడు. రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు లేకపోవడంతో, ఎంతో మంది యువ క్రికెటర్లు ఉత్కంఠ మ్యాచ్‌ల్లో తలపడే అవకాశాన్ని కోల్పోతున్నారని ‘సుల్తాన్ ఆఫ్ స్వింగ్’ వాపోయాడు.
యాషెస్ కంటే గొప్పది..
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కంటే భారత్, పాకిస్తాన్ పోరు చాలా గొప్పదని అక్రం వ్యాఖ్యానించాడు. యాషెస్ సిరీస్‌ను కోటి మంది వీక్షిస్తే, భారత్, పాక్ సిరీస్‌ను వంద కోట్ల మంది చూస్తారని అన్నాడు. ప్రతి క్షణం ఎంతో ఉత్కంఠగా, పోటాపోటీగా మ్యాచ్‌లు సాగుతాయి కాబట్టి, రెండు జట్లకు చెందిన క్రికెటర్లు తమ శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పాడు. ఈ వాస్తవాన్ని కూడా గుర్తించకుండా బిసిసిఐ మొండి వైఖరిని అనుసరిస్తుంటే, ఐసిసి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదన్నాడు.