క్రీడాభూమి

శ్రీలంక బ్యాటింగ్ ప్రాక్టీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 11: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో శనివారం మొదలైన రెండు రోజుల టూర్ మ్యాచ్ తొలి రోజును శ్రీలంక బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌గా మార్చుకుంది. ఫలితంగా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరు చేసింది. సదీర సమరవిక్రమ 77 బంతుల్లో 74 పరుగులు చేశాడు. దిముత్ కరుణరత్నే (50 రిటైర్డ్ హర్ట్)తో కలిసి అతను మొదటి వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వీరిద్దరితోపాటు ఏంజెలో మాథ్యూస్ (54 రిటైర్డ్ హర్ట్), నిరోషన్ డిక్‌విల్లా (73 నాటౌట్) అర్ధ శతకాలను నమోదు చేశారు. మొదటి రోజు ఆట చివరి దశలో దిల్‌రువాన్ పెరెరా 48 పరుగులు సాధించడం విశేషం. బోర్డు ప్రెసిడెంట్స్ బౌలర్లలో సందీప్ వారియర్, ఆకాశ్ భండారీ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోరుబోర్డు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 88 ఓవర్లలో 6 వికెట్లకు 411 (సదీర సమరవిక్రమ 74, దిముత్ కరుణరత్నే 50 రిటైర్డ్ హర్ట్, ఏంజెలో మాథ్యూస్ 54 రిటైర్డ్ హర్ట్, నిరోషన్ డిక్‌విల్లా 73 బ్యాటింగ్, దిల్‌రువాన్ పెరెరా 48, సందీప్ వారియర్ 2/60, ఆకాశ్ భండారీ 2/11, అవేష్ ఖాన్ 1/68, జలజ్ సక్సేనా 1/100).

శ్రీలంక , బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ మధ్య శనివారం మొదలైన ప్రాక్టీస్ మధ్యలో మైదానంలోకి చొచ్చుకొచ్చి పరుగులు తీసిన ఓ శునకం. గ్రౌండ్స్ స్టాఫ్ వెంటనే స్పందించి దానిని వెళ్లగొట్టడంతో ఆట కొనసాగింది

చిత్రం..బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో కోల్‌కతాలో శనివారం మొదలైన
టూర్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఓ సింగిల్ తీస్తున్న
శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్