క్రీడాభూమి

ఈ ఏటి మేటి ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 11: టెన్నిస్ పురుషుల విభాగంలో ఈ ఏటి మేటి క్రీడాకారుడు ఎవరన్నది ఆదివారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఏటీపీ వరల్డ్ టూర్ పైనల్స్ టోర్నమెంట్‌తో తేలిపోతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు పోటీపడుతున్నప్పటికీ, అందరి దృష్టి ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్, రెండో ర్యాంక్‌లో ఉన్న రోజర్ ఫెదరర్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ ఏడాది ఇద్దరూ చెరి రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని, సమవుజ్జీలుగా నిలిచారు. ఏడాది మొదట్లో ఇద్దరూ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వెనుకబడినప్పటికీ, ఎవరూ ఊహించని రీతిలో విజయ పరంపరలను కొనసాగించి, మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. చిరకాల ప్రత్యర్థులైన వీరిద్దరే టైటిల్ పోరులో మరోసారి ఎదురుపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, నాదల్‌ను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో, అతను ఫైనల్ చేరడం అనుమానంగా ఉందని విశే్లషకులు అంటున్నారు. ఇదే విషయాన్ని నాదల్ ప్రస్తావిస్తూ, ప్రమాదకరమైన సమస్యలు లేకపోయినప్పటికీ తాను నూరు శాతం ఫిట్నెస్‌తో లేనని అంగీకరించాడు. టోర్నీలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మ్యాచ్‌లు ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ ఫిట్నెస్ సమస్య భరించ లేనంత తీవ్రంగా ఉంటే, ఈ టోర్నీకి హాజరయ్యే వాడిని కానని వ్యాఖ్యానించాడు. అయితే, ఫిట్నెస్ గురించి నాదల్ ధీమాతో ఉండడం మంచిదేగానీ, పాత గాయాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అతని ఫిట్నెస్‌పై వస్తున్న వార్తలు అభిమానులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫెదరర్, నాదల్ ‘షో డౌన్’ను మరోసారి చూసే అవకాశం దక్కుతుందా? లేదా? అన్న ప్రశ్న అందరినీ వేధిస్తున్నది.
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడే ఎనిమిది మంది ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. పీట్ సంప్రాస్ గ్రూపులో రాఫెల్ నాదల్ (స్పెయిన్), డామినిక్ థియేమ్ (ఆస్ట్రియా), గ్రెగరీ దిమిత్రోవ్ (బల్గేరియా), డేవిడ్ గోఫిన్ (బెల్జియం) పరస్పరం పోటీపడతారు. అదే విధంగా బోరిస్ బెకర్ గ్రూపులో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మారిన్ సిలిక్ (క్రొయేషియా), జాక్ సాక్ (అమెరికా) మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే, ఒక ఆటగాడు తన గ్రూపులోని మిగతా ముగ్గురితోనూ మ్యాచ్‌లు ఆడతాడు. రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల ఆక్రమించిన ఆటగాళ్లు నాకౌట్ దశ (సెమీస్)కు చేరతారు.

లండన్‌లో జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ టెన్నిస్ ఫైనల్స్ టోర్నమెంట్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న
టెన్నిస్ స్టార్లు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్నవారు
ఈ టోర్నీలో పోటీపడతారు