క్రీడాభూమి

తుపాకీ గురిపెట్టి దోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావొ ఫౌలో (బ్రెజిల్), నవంబర్ 12: మెర్సిడిజ్ ఫార్ములా వన్ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. గుర్తుతెలియని వ్యక్తులు వారి తలకు గురిపెట్టి, దోపిడీకి తెగబడ్డారని ఆ జట్టు స్టార్ డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ట్వీట్ చేశాడు. బ్రెజిల్ సర్క్యూట్ నుంచి హోటల్‌కు తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న మినీ బస్సును కొంత మంది వ్యక్తులు అడ్డగించారని హామిల్టన్ తెలిపాడు. మొదట గాల్లో కాల్పులు జరిపి, ఆతర్వాత వాహనంలోని ప్రయాణిస్తున్న వారి తలలకు తుపాకీ గురిపెట్టి దోపిడీకి తెగబడ్డారని వివరించాడు. విలువైన వస్తువులు పోయినప్పటికీ, ఎవరూ గాయపడకపోవడం తనకు ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నాడు. ఇలావుంటే, హామిల్టిన్ బృందం ఇచ్చిన ఫిర్యాదుతో సావొ పౌలో పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.

చిత్రం..దోపిడీ సంఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసిన లూయిస్ హామిల్టన్