క్రీడాభూమి

మోకాలి నొప్పి బాధిస్తున్నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 12: చాలాకాలంగా మోకాలి నొప్పి బాధిస్తున్నదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఒకటిరెండు వారాల విశ్రాంతి తీసుకున్న తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని, శస్త్ర చికిత్స అవసరమా? కాదా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటానని ఇక్కడ జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ కార్యక్రమంలో పాల్గొన్న సానియా విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. మహిళల డబుల్స్ విభాగంలో ఈ ఏడాదిని నంబర్ వన్ స్థానంతో మొదలుపెట్టిన సానియా ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, చాలా టోర్నీల్లో తన భాగస్వాములకు ఫిట్నెస్ సమస్యలు ఎదురుకావడం ఈ పరిస్థితికి ఒక కారణమని చెప్పింది. తనను కూడా మోకాలి నొప్పి వేధిస్తున్నదని తెలిపింది. స్థూలంగా చూస్తే, ఈ ఏడాది సంతృప్తికరంగానే కొనసాగిందని సానియా పేర్కొంది. భారత డేవిస్ కప్ కెప్టెన్ మహేష్ భూపతి మాట్లాడుతూ యువ ఆటగాడు రాంకుమార్ రామనాథన్ త్వరలోనే ప్రపంచ ర్యాంకింగ్స్ టాప్ 100లో చోటు సంపాదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 23 ఏళ్ల రాంకుమార్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నాడు. వచ్చే రెండేళ్లు అతనికి అత్యంత కీలకమైనవని తెలిపాడు. ఎమిలీ సాంచెస్ కోచింగ్‌లో అతను ఉన్నత ప్రమాణాలను అందుకుంటున్నాడని భూపతి అన్నాడు.