క్రీడాభూమి

నాలుగో స్థానంలో మాథ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: జట్టులోని సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ వెల్లడించాడు. టీమిండియాతో గురువారం నుంచి మొదటి టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో, బుధవారం అతను విలేఖరుల సమావేశంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ జట్టు అవసరాలను గుర్తించి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు దిగేందుకు మాథ్యూస్ సంసిద్ధత వ్యక్తం చేశాడని చెప్పాడు. అతని అనుభవాన్ని, సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని నిర్ణయించుకున్నట్టు చండీమల్ తెలిపాడు. సుమారు రెండేళ్లుగా మాథ్యూస్ ఫామ్‌లో లేడు. ఒకానొక దశలో, 32 ఇన్నింగ్స్ ఆడి కేవలం 917 పరుగులు చేశాడు. అయితే, మళ్లీ ఫామ్‌లోకి రావడం మాథ్యూస్‌కు కష్టం కాదని చండీమల్ అన్నాడు. టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతను కీలక భూమిక పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన అనుభవం తనకు లేకపోయినప్పటికీ, ఇతరత్రా ఫార్మాట్స్‌లో మ్యాచ్‌లు ఆడానని, కాబట్టి పిచ్‌ల తీరు, వాతావరణంపై కొంత అవగాహన ఉందని తెలిపాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై పచ్చిక ఎక్కువగా కనిపిస్తున్నదని, ఈ తరహా పిచ్‌లపై తమ ఆటగాళ్లు రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. భారత్‌ను బలమైన జట్టుగా అతను అభివర్ణించాడు. పట్టుదల, నిరంతర శ్రమతో భారత్ పటిష్టమైన జట్టుగా ఎదిగిందన్నాడు. అయితే, టీమిండియాను చూసి భయపడడం లేదని, గట్టిపోటీని ఇచ్చి తీరుతామని అతను స్పష్టం చేశాడు.