క్రీడాభూమి

శ్రీలంకతో పోరుకు టీమిండియా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 15: శ్రీలంక టూర్‌కు వెళ్లినప్పుడు అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 9-0 తేడాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరోసారి అదే ఫలితంపై గురిపెట్టింది. గురువారం నుంచి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే మొదటి మ్యాచ్‌తో టెస్టు సిరీస్ మొదలవుతుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ ముగిసిన తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి ఇరు జట్లు అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంటాయి. మూడు వనే్డలు, మూడు టి-20 ఇంటర్నేషనల్స్ జరగనున్న నేపథ్యంలో, టెస్టులతో కలిపి మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో పోటీపడుతున్న భారత్ అన్నింటిలోనూ విజయాలపై కనే్నసింది. మొత్తం 4,498 పాయింట్లతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న భారత్‌కు 3,658 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకను టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయడం కష్టం కాదన్నది వాస్తవం. ఏదైనా అద్భుతం జరిగి, శ్రీలంక 3-0 తేడాతో గెలిచినా, భారత నంబర్ వన్ స్థానానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్‌ను టెస్టు సిరీస్‌లో 2-0 తేడాతో ఓడించి, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నప్పటికీ భారత్‌లో శ్రీలంక అలాంటి ఫలితానే్న పునరావృతం చేసే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి.

ఫేవరిట్ భారత్

అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ గురువారం నుంచి మొదలయ్యే మొదటి టెస్టులో ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో కొంత వెనుకబడిందనే వాదన ఉండేది. కానీ, సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చేరికతో బౌలింగ్ కూడా బలోపేతమైంది. లంకతో మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నప్పటికీ, అశ్విన్, జడేజాలను కాదని కెప్టెన్ కోహ్లీ అతనిని ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకుంటాడని అనుకునేందుకు వీల్లేదు. టెస్టు ఫార్మాట్‌లో అశ్విన్, జడేజా గొప్పగా రాణిస్తారని అతని నమ్మకం. పేస్ విషయానికి వస్తే ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ తుది జట్టులో తప్పక ఉంటారని విశే్లషకుల అభిప్రాయం. అయితే, జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ కూడా అందుబాటులో ఉంటారు. ఎంత మంది బౌలర్లతో టెస్టు ఆడాలని నిర్ణయించుకుంటారనే విషయంపైనే పేసర్ల లైనప్‌పై ఒక అవగాహన వస్తుంది. అప్పటి వరకూ ఎవరు మైదానంలోకి అడుగుపెడతారు? ఎవరు బెంచ్‌కే పరిమితమవుతారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం.

హెరాత్‌పైనే భారం!
గాయం నుంచి కోలుకొని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమైన సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్‌పైనే భారం వేసి శ్రీలంక జట్టు టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. 39 ఏళ్ల హెరాత్ మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు ఊరటనిస్తున్నది. సుమారు రెండున్నర సంవత్సరాలుగా ప్రమాణాలు పతనం కావడంతో పరాజయాల బాటను వీడని శ్రీలంక క్రమంగా కోలుకుంటున్నది.
ప్రయోగాలు తప్పనిసరి కావడంతో, లంక క్రికెట్ ప్రస్తుతం సంధి కాలంలో ఉంది. ఈ స్థితిని సమర్థంగా అధిగమించి, మళ్లీ గాడిలో పడే శక్తిసామర్థ్యాలు లంక జట్టుకు లేకపోలేదు. హెరాత్ వంటి ఒకరిద్దరు బౌలర్లు, అదే సంఖ్యలో బ్యాట్స్‌మెన్ భుజాలపై భారాన్ని మోపి, బలమైన భారత్‌ను ఎదుర్కోవడానికి శ్రీలంక సన్నాహాలను పూర్తి చేసింది. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పలేకపోయినా, గట్టిపోటీ ఇవ్వడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయనడంలో అనుమానం లేదు.