క్రీడాభూమి

ఆట అనుమానమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: భారత్, శ్రీలంక జట్ల మధ్య మొదటి టెస్టులో ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటల ఆట సాధ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జల్లులు కురుస్తున్న నేపథ్యంలో మొదటి రోజైన గురువారం నాటి ఆటలో మొదటి రెండు సెషన్లలో ఒక్క ఓవర్ కూడా బౌల్ కాలేదు. మూడో సెషన్‌లో కొంత సేపు ఆట సాధ్యమైనప్పటికీ, వెలుతురు సరిగ్గా లేని కారణంగా నిర్ణీత సమయానికి ముందే మొదటి రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, నిగెల్ లాంగ్ ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందువల్ల రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో, ఈ మ్యాచ్‌లో ఆట సజావుగా కొనసాగడం అనుమానంగానే కనిపిస్తున్నది. పిచ్‌ను మూడు లేయర్లతో కూడిన దట్టమైన కవర్లతో కప్పివుంచారు. వర్షం కొంచం తగ్గగానే కవర్లను తొలగిస్తూ, ఔట్‌ఫీల్డ్‌పై ఉన్న నీటిని తొలగించడానికి సూపర్ సోపర్లతో గ్రౌండ్స్‌మెన్ తీవ్రంగా శ్రమించారు. అయితే, వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. జల్లులు తగ్గినట్టు కనిపించడం.. వెంటనే గ్రౌండ్స్‌మెన్ రంగంలోకి దిగడం.. అంతలోనే మళ్లీ జల్లులు కురవడం.. ఈ దోబూచులాట మధ్యలోనే మూడు సమయం గడిచిపోయింది. టెస్టు మ్యాచ్‌ల్లో ఒక రోజు 90 ఓవర్లు బౌల్ కావాల్సి ఉండగా, 12 ఓవర్లు కూడా పూర్తికాలేదు. పిచ్‌పై తేమ ఉండడం శ్రీలంక పేసర్ సురంగ లక్మల్‌కు లాభించింది. భారత బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వని అతను వాతావరణ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొని, మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండో రోజైన శుక్రవారం ఎన్ని ఓవర్లు బౌల్ అవుతాయనే విషయంపైనే భారత బ్యాటింగ్ నిలదొక్కుకుంటుందా లేక పూర్తిగా విఫలమవుతుందా అన్నది ఆధారపడి ఉంటుంది.