క్రీడాభూమి

ఆస్ట్రేలియా యాషెస్ జట్టులో కీపర్ పైన్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, నవంబర్ 17: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో వికెట్‌కీపర్ టిమ్ పైన్‌కు చోటు దక్కింది. ఐదు మ్యాచ్ ఈ టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా జాతీయ సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేసింది. ఎవరూ ఊహించని విధంగా 32 ఏళ్ల పైన్‌ను జట్టులోకి తీసుకున్నారు. 2010 అక్టోబర్‌లో చివరిసారి టెస్టు ఆడిన పైన్‌కు మాథ్యూ వేడ్ స్థానాన్ని కట్టబెట్టారు. ఫామ్‌లో లేకపోవడమే వేడ్‌పై వేటుకు కారణం. మరో వికెట్‌కీపర్ పీటర్ నెవిల్ అందుబాటులో ఉన్నప్పటికీ, సీనియర్ కావడంతో పైన్ పట్ల సెలక్టర్లు మొగ్గు చూపినట్టు సమాచారం. దేశవాళీ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరచిన అతను, ఇటీవల వామప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొన్న క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎలెవెన్ తరఫున కీపర్‌గా సేవలు అందించాడు. అర్ధ శతకం సాధించి, బ్యాటింగ్ ప్రతిభను కూడా నిరూపించుకొని, సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. కాగా, పది టెస్టులు ఆడిన మాట్ రెన్షాకు ఉద్వాసన పలికిన సెలక్టర్లు అతని స్థానంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను తీసుకున్నారు. కెరీర్‌లో ఇంత వరకూ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కని బాన్‌క్రాఫ్ట్ యాషెస్ సిరీస్‌లో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టవచ్చు.
జట్టు వివరాలు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, జాక్సన్ బర్డ్, పాట్ కమిన్స్, పీటర్ హాండ్స్‌కోమ్, జొష్ హాజెల్‌వుడ్, ఉస్మాన్ ఖాజా, నాథన్ లియాన్, షాన్ మార్ష్, టిమ్ పైన్ (వికెట్‌కీపర్), చాడ్ సయెర్స్, మిచెల్ స్టార్క్.