క్రీడాభూమి

మాజీ కెప్టెన్ సర్దార్‌కు మొండిచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: భారత మాజీ కెప్టెన్, వెటరన్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్‌కు వచ్చేనెల జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన రూపీందర్‌పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా మళ్లీ జట్టులోకి వచ్చారు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యమిచ్చే క్రమంలోనే, ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించిన సర్దార్ పట్ల సెలక్టర్లు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. రూపీందర్ ఐదు నెలల తర్వాత మళ్లీ జట్టులో చోటు సంపాదించగా, లాక్రా మోకాలి గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చాడు. కాగా, 22 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
జట్టు వివరాలు
గోల్‌కీపర్స్: ఆకాష్ అనిల్ చిక్టే, సూరజ్ కర్కేరా, డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రొహిదాస్, డిప్సాన్ టిర్కే, వరుణ్ కుమార్, రూపీందర్‌పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లెన్‌సనా సింగ్ (వైస్ కెప్టెన్), ఎస్‌కె ఉతప్ప, సుమీత్, కొథాజిత్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, గుజ్రాంత్ సింగ్.