క్రీడాభూమి

ఫాంగ్జీ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుజొ, నవంబర్ 18: చైనా టీనేజ్ సంచలనం గవో ఫాంగ్జీ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ జరుగుతున్న చైనా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత స్టార్ పివి సింధును ఓడించిన ఫాంగ్జీ అదే దూకుడును కొనసాగిస్తూ, సెమీ ఫైనల్‌లో ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి, ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్‌ను 21-19, 21-19 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫర్‌గా ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన 19 ఏళ్ల ఫాంగ్జీ టైటిల్ కోసం అకానే యమాగూచీని ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో యమాగూచీ 21-14, 21-18 ఆధిక్యంతో రచానొక్ ఇంతనాన్‌పై విజయం సాధించింది. ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సెన్, చెన్ లాంగ్ ఫైనల్‌లో తలపడతారు. ఎక్సెల్సెన్ 21-12, 21-17 తేడాతో ఇంగ్ కా లాంగ్‌ను, చెంగ్ 21-17, 10-21, 21-7 స్కోరుతో సన్ వాన్ హోను ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టారు.

చిత్రం..గవో ఫాంగ్జీ