క్రీడాభూమి

‘ప్యాకెట్ హెర్క్యులస్’ సులేమానొగ్లూ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్టాంబుల్, నవంబర్ 18: పొట్టివాడైనా, గట్టివాడన్న పేరు పొందిన వెయిట్‌లిఫ్టర్ నయిమ్ సులేమానొగ్లూ (50) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. కేవలం 4 అడుగుల, 8 అంగుళాల పొడవుతో, వెయిట్‌లిఫ్టింగ్‌కు ఏ మాత్రం పనికిరాడని వెక్కిరింతలు, అవమానాలు ఎదురైనప్పటికీ, మొక్కవోని దీక్షతో ప్రపంచ మేటి లిఫ్టర్‌గా ఎదిగిన సులేమానొగ్లూ వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు అందుకొని, హ్యాట్రిక్ సాధించాడు. 1988 సియోల్, 1992 బార్సిలోనా, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సులేమానొగ్లూ విజయభేరి మోగించి, అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. పొట్టిగా ఉండే సింహబలుడు అంటూ అతనిని యావత్ ప్రపంచం కీర్తించింది. ‘ప్యాకెట్ హెర్క్యులస్’ అన్న ముద్దుపేరు అతనికి స్థిరపడింది. బల్గేరియాలో జన్మించిన సులేమానొగ్లూ ఆతర్వాత టర్కీలో స్థిరపడ్డాడు. టర్నీ తరపునే ఒలింపిక్స్‌లో పాల్గొని, సత్తా చాటాడు. గత కొంతకాలంగా కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న అతనికి సెప్టెంబర్ మాసంలో శస్త్ర చికిత్స జరిగింది. ఆ ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. కానీ, కొన్ని రోజుల్లోనే సమస్య తిరగబెట్టింది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ‘టర్కీ హీరో’గా ప్రజల నీరాజనాలు అందుకున్న సులేమానొగ్లూ మృతి పట్ల క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టర్కీ సంతాప దినాలను ప్రకటించింది.