క్రీడాభూమి

చండీమల్ ‘ఫేక్ ఫీల్డింగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 18: శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ క్రీడాస్ఫూర్తికి గండికొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, ‘ఫేక్ ఫీల్డింగ్’తో పరువు పోగొట్టుకున్నాడు. అతని వైఖరిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంఘటన వివరాల్లోకి వెళితే, 53వ ఓవర్ నాలుగో బంతిని భారత ఆటగాడు భువనేశ్వర్ కుమార్ కవర్స్ దిశగా కొట్టాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న చండీమల్ తన వద్దకు బంతి రాక ముందే దానిని ఒడిసి పట్టుకున్నట్టు, వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు దానిని విసరనున్నట్టు నటించాడు. అప్పటికే ఒక పరుగును పూర్తి చేసిన భువీ రెండో పరుగు కోసం ప్రయత్నించకుండా ఆగిపోయాడు. బంతి తన సమీపానికి రాకముందే, దానిని ఫీల్డ్ చేసినట్టు తప్పుడు సంకేతాలివ్వడం ఐసిసి నిబంధనలకు విరుద్ధం. అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, బ్యాటింగ్ జట్టుకు అదనంగా ఐదు పరుగులిస్తారు. కొత్తగా సవరించిన నిబంధన ప్రకారం ‘ఫేక్ ఫీల్డింగ్’ చేసిన ఆటగాడిపై జరిమానా విధిస్తారు. కానీ, చండీమల్‌పై అంపైర్లు ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ని తిలకిస్తున్న కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది. ఐదు పరుగులు ఇవ్వాలంటూ అతను ఐదు వేళ్లు చూపినప్పటికీ అంపైర్లు పట్టించుకోలేదు.

చిత్రాలు. *బంతిని పట్టుకోకుండానే ఫీల్డింగ్ చేసిన భంగిమతో భువనేశ్వర్ కుమార్‌ను
తప్పుదోవ పట్టించిన శ్రీలంక కెప్టెన్ చండీమల్
*.లంక కెప్టెన్ ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడిన కారణంగా నిబంధనల ప్రకారం ఐదు పరుగులను
ప్రకటించాలన్న ఉద్దేశంతో అంపైర్లకు ఐదు వేళ్లను చూపుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతనినే
గమనిస్తున్న శిఖర్ ధావన్