క్రీడాభూమి

సెమీస్‌లో గెలిచేదెవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్, మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ మధ్య జరిగే మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇండియన్ వెల్స్ పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో వీరిద్దరూ తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వీరిద్దరూ సులభంగా ప్రత్యర్థులను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టారు. జొకొవిచ్ 7-6, 7-6 తేడాతో జో విల్‌ప్రైడ్ సొంగాపై గెలుపొందగా, నాదల్ 6-4, 6-3 తేడాతో విజయం సాధించి సెమీస్ చేరాడు. టెన్నిస్‌లో చిరకాల ప్రత్యర్థుల జాబితాలో వీరిద్దరూ ముందు వరుసలో నిలుస్తారు. పరస్పరం 47 మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకూ వీరు తలపడ్డారు. జొకొవిచ్ 24 మ్యాచ్‌ల్లో గెలిస్తే నాదల్ 23 విజయాలను సాధించాడు. ఇండియన్ వెల్స్ సెమీ ఫైనల్‌లో గెలవడం ద్వారా చాలకాలంగా తనను వేధిస్తున్న ఫిట్నెస్ సమస్య నుంచి పూర్తిగా బయటపడేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవడమేగాక, జయాపజయాల చిట్టాను సమం చేయాలని నాదల్ భావిస్తున్నాడు. అయితే, గత 18 నెలలుగా ఒక్క మేజర్ టైటిల్‌ను కూడా సాధించలేకపోయిన నాదల్ సరైన ఫామ్‌లో లేడదన్నది వాస్తవం. గాయాల సమస్య ఒకవైపు, చాలా టోర్నీలకు దూరం కావడంతో తగినంత ప్రాక్టీస్ లేకపోవడం మరోవైపు నాదల్‌ను వేధిస్తున్నాయి. అసాధారణ ఫామ్‌లో ఉన్న పైగా ప్రపంచ నంబర్ వన్ జొకొవిచ్‌ను ఢీకొనాల్సి రావడం కూడా నాదల్ సమస్యలను పెంచుతున్నది. జొకొవిచ్‌కు విజయావకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, నాదల్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పరిశీలకుల అభిప్రాయం. మొత్తం మీద ఇద్దరు మేటి ఆటగాళ్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డేవిడ్ గోఫిన్, మిలోస్ రవోనిక్ ఢీ కొంటారు. గోఫిన్ 7-6, 6-2 తేడాతో మారిన్ సిలిక్‌ను, రవోనిక్ 7-5, 6-3 స్కోరుతో గేల్ మోన్ఫిల్‌ను ఓడించి సెమీస్ చేరారు.