క్రీడాభూమి

భారత పేసర్ల హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు సాధించకుండా కట్టడి చేయడంలో భారత పేసర్లు సఫలమయ్యారు. మొత్తం పది వికెట్లను ముగ్గురు పేసర్లు, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ పంచుకున్నారు. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో భారత పేసర్లు ఈ విధంగా ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లను తమ ఖాతాలోనే వేసుకోవడం ఇది మూడోసారి. 1981లో ఇంగ్లాండ్‌తో ముంబయిలో జరిగిన టెస్టులో మొదటిసారి భారత ఫాస్ట్ బౌలర్లు పది వికెట్లు పడగొట్టారు. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్, మదన్‌లాల్ చెరి ఐదు వికెట్లు సాధించారు. 1983లో వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ తొమ్మిది వికెట్లు సాధించగా, మరో ఫాస్ట్ బౌలర్ బల్వీందర్ సింగ్ సంధు ఒక వికెట్ తీసుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ చెరి నాలుగు వికెట్లు కూల్చగా, ఉమేష్ యాదవ్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు కనీసం రెండు వికెట్లు సాధించిన సంఘటన చివరిసారి 1986లో చోటు చేసుకుంది. ఇనే్నళ్లకు భువీ, షమీ, ఉమేష్ ఆ ఫీట్‌ను పునరావృతం చేశారు. మొత్తం మీద భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ విధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు కనీసం రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకోవడం ఇది నాలుగోసారి.