క్రీడాభూమి

యాషెస్ సిరీస్‌కు ముందే ఆసీస్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, నవంబర్ 21: ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ క్రికెట్ సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్న ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. మరో రెండు రోజుల్లో బ్రిస్బేన్‌లో మొదలయ్యే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్టు మ్యాచ్ కోసం మంగళవారం కంగారూలు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆసీస్ వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్ మెడకు గాయమైంది. గబ్బా ఔట్‌ఫీల్డ్‌లో వార్నర్ ఒక క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తుండగా అతని మెడ పట్టేసి తీవ్రంగా నొప్పి మొదలైంది. దీంతో అతను చికిత్స చేయించుకునేందుకు వెంటనే మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ‘క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నా మెడ పట్టేసి తీవ్రంగా నొప్పి మొదలైంది. దీంతో చికిత్స చేయించుకునేందుకు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అంతమాత్రన నేను జట్టుకు దూరమవుతానని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నా. పరిస్థితి చక్కబడితే మళ్లీ రేపే నెట్‌ప్రాక్టీస్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని వార్నర్ విలేఖరులకు స్పష్టం చేశాడు. ఓపెనర్‌గా సేవలందిస్తూ ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న వార్నర్ ఇప్పటివరకూ స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లలో దాదాపు 60 పరుగుల సగటును కలిగి ఉన్నాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో అతను కొత్త ఆటగాడు కామెరాన్ బాంక్రాఫ్ట్‌తో కలసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాల్సి ఉంది.

చిత్రం..మెడ నొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్