క్రీడాభూమి

సెరెనా విలియమ్స్‌కే విశే్లషకుల ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: సుమారు 14 సంవత్సరాల తర్వాత ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ లోకి అడుగుపెట్టిన ప్రపంచ నంబర్ వన్ క్రీడా కారిణి సెరెనా విలియమ్స్‌కే మహిళల సింగిల్స్ టైటిల్ దక్కుతుందని విశే్లషకుల అభిప్రాయం. 2001లో ఇండియన్ వెల్స్ సెమీ ఫైనల్స్‌లో సెరెనా, ఆమె సోదరి వీనస్ విలియమ్స్ తలప డాల్సి వచ్చింది. అయతే, అప్పుడప్పుడే అంత ర్జాతీయ సర్క్యూట్‌లో తన ఉనికిని చాటుకుం టున్న సెరెనాను ఎదుర్కోలేదు. గాయం సమ స్య వేధిస్తున్నదని పేర్కొంటూ ఆమె మ్యాజ్ నుంచి వైదొలగింది. అయతే, సెరెనాకు అవకా శం ఇవ్వడానికే వీసన్ త్యాగం చేసిందని విమ ర్శలు వెల్లువెత్తాయ. దీనితో సెరెనా ఫైనల్ ఆడేం దుకు బరిలోకి దిగిన మరుక్షణం నుంచే ప్రేక్ష కులు ఆమెను హేళన చేయడం ఆరంభించారు. కిమ్ క్లిజ్‌స్టెర్స్‌ను ఓడించి టైటిల్ సంపాదించి నప్పటికీ ప్రేక్షకులు ఎవరూ సెరెనాను మెచ్చుకో లేదు. పైగా ట్రోఫీని తీసుకునే సమయంలోనూ ఆమెను వెక్కిరించారు. జాతి వివక్షతోనే తన కు మార్తెను ప్రేక్షకులు వేధించారంటూ సెరెనా తం డ్రి రిచర్డ్ విలియమ్స్ ఆరోపించాడు. సెరెనా, వీ నస్ ఇకపై ఇండియన్ వెల్స్‌లో పాల్గొనబోరని ప్రకటించాడు. నాటి నుంచి ఈ టోర్నీకి సెరెనా, వీనస్‌లు దూరమయ్యారు. గత ఏడాది వీనస్ మనసు మార్చుకొని ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడింది. కానీ, సెరెనా మాత్రం ససేమిరా అంది. ఈసారి ఆమె కూడా తన నిర్ణయాన్ని మార్చు కుంది. అద్వితీయ ఫామ్‌ను ప్రదర్శిస్తూ ఫైనల్ చేరింది. టైటిల్ కూడా ఆమెనే గెల్చుకుంటుం దని విశే్లషకులు అంటున్నారు.

అదో గొప్ప అనుభూతి!
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ని చూస్తున్నాడని, అలాంటి మేరుపర్వతం సమక్షంలో పాకిస్తాన్‌ను ఓడించడం గొప్ప అనుభూతి అని కోహ్లీ అన్నాడు. సచిన్ స్టాండ్స్‌లో ఉన్నాడన్న ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. ఎన్నో సంవత్సరాలు దేశానికి సచిన్ అత్యుత్తమ సేవలు అందించాడని, అందుకే ఇప్పటికీ ప్రేక్షకులు ముందుగా అతని పేరునే స్మరిస్తుంటారని కోహ్లీ అన్నాడు. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొని ఓటమిపాలైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ మ్యాచ్‌లో విఫలం కావడం తనను బాధిస్తున్నదని అన్నాడు. అయితే, అదే ఫలితాన్ని తలచుకుంటూ కూర్చోవడంలో అర్థం లేదన్నాడు. పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చామని పేర్కొన్నాడు.

పఆసుపత్రుల్లో
టీవీలు బంద్!
కరాచీ, మార్చి 20: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య శనివారం జరిగిన హైవోల్టేజీ మ్యాచ్ ప్రభావం సాధారణ ప్రజల మీదేకాదు.. ఆసుపత్రులపైనా పడింది. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీవీ సెట్లను పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా నగర పాలక మండలి తొలగించింది. ఆసుపత్రుల్లో గుండె సంబంధమైన వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు కూడా ఉంటారని, భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అనగానే తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంటుందని అధికారులు ప్రకటించారు. అందుకే టీవీ సెట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేయడమేగాక, పటిష్టంగా అమలు చేశారు. శనివారం ఉదయమే తొలగించిన టీవీ సెట్లను ఆదివారం రాత్రి మళ్లీ యథాస్థానంలో ఉంచారు.