క్రీడాభూమి

చిరకాల స్వప్నం సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 21: భారత క్రికెట్ జట్టులో చోటు కోసం తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈ ఎదురు చూపులు ఫలించి ఇప్పుడు తనకు టీమిండియాలో చోటు లభించడం పట్ల అతను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్న ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను ప్రస్తుతం శ్రీలంకతో కొనసాగుతున్న టెస్టు సిరీస్‌లో పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు బదులుగా జట్టులోకి తీసుకున్నారు. దీంతో భారత జట్టులో భాగస్వామిని కావాలన్న తన చిరకాల స్వప్నం నెరవేరిందని విజయ్ శంకర్ (26) మంగళవారం ఇండోర్ నుంచి పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. టీమిండియాలో చోటు లభిస్తుందని తాను అనుకోలేదని, అయినప్పటికీ తన శ్రమకు ఫలితం లభించడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని అతను హర్షాన్ని వ్యక్తం చేస్తూ, తొలిసారి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపాడు. గతంలో తాను ఇండియా-ఏ జట్టులో ఆడటం ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు ఎంతగానో ఉపకరించిందన్నాడు. ‘నేను ఇండియా-ఏ జట్టులో ఆడటం ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు దోహదపడింది. ఆటగాడిగా పరిణితి సాధించేందుకు, భిన్నమైన పరిస్థిల్లో రాణించడం ఎలాగో తెలుసుకునేందుకు ఇది ఎంగానో ఉపకరించింది’ అని అతను చెప్పాడు. బ్యాటింగ్‌లో చక్కటి ఫామ్‌ను కొనసాగిస్తున్న విజయ్ శంకర్ ప్రస్తుతం కొనసాగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఒడిశా జట్టుపై సెంచరీతో సత్తా చాటుకున్నాడు. అలాగే బౌలింగ్‌లోనూ లాంగ్ స్పెల్స్ వేయగలుగుతున్న తాను ముంబయిపై నాలుగు వికెట్లు సాధించడం మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపాడు. గతంలో వరుసగా గాయాల బారిన పడి కొన్ని మ్యాచ్‌లకు, ఇండియా-ఏ టూర్లకు దూరమైన విజయ్ శంకర్ ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఎదురు చూస్తున్నాడు. గత సీజన్‌లో జరిగిన దేవ్‌ధర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లలో విజయ్ శంకర్ తమిళనాడు జట్టును విజయ పథంలో నడిపాడు. గాయాలతో కొంత కాలం పాటు ఇబ్బంది పడినప్పటికీ ఫిట్నెస్‌ను మెరుగుపర్చుకునేందుకు ఎంతగానో శ్రమించానని అతను తెలిపాడు. ‘గాయాల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవడం అసంతృప్తిని కలిగించింది. అయినప్పటికీ మళ్లీ ఫిట్నెస్ సాధించేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో తీవ్రంగా శ్రమించా. అక్కడి ఫిజియోలు, ట్రైనర్లు ఈ విషయంలో నాకు ఎంతో తోడ్పాటును అందించారు. ఇది నేను మరింత రాటుదేలేందుకు ఉపకరించింది’ అని విజయ్ శంకర్ వివరించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్ టీమిండియా మాజీ ఆటగాడు, తమిళనాడు జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వద్ద శిక్షణ పొందుతున్నాడు. బౌలింగ్‌లో వేగాన్ని పెంచుకుని, తన ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని అతను తెలిపాడు. ఇప్పుడు భారత టెస్టు క్రికెట్ జట్టు నుంచి విజయ్ శంకర్‌కు పిలుపు రావడం పట్ల అతని కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి టిఎన్‌సిఎ (తమిళనాడు క్రికెట్ అసోసియేషన్) లీగ్‌లో ఆడుతున్న అతని సోదరుడు అజయ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఫిట్నెస్ కోసం విజయ్ శంకర్ తీవ్రస్థాయిలో శ్రమించాడు. అతని కఠోర శ్రమ ఫలించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు అతను జాతీయ జట్టులో రాణిస్తాడని ఆసక్తితో ఎదురు చూస్తున్నాం’ అని అజయ్ తెలిపాడు.