క్రీడాభూమి

ఇంగ్లాండ్ ఖాతాలో భారీ విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాషెస్‌లో భారీ విజయాల జాబితాలోని మొదటి మూడు స్థానాల్లో రెండు ఇంగ్లాండ్ ఖాతాలో చేరాయి. 1938లో ది ఓవల్ మైదానంలో ఆ జట్టు ఇన్నింగ్స్ 579 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. 1946 నవంబర్‌లో బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టును ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 332 పరుగుల తేడాతో కైవసం చేసుకోగా, 1892 అడెలైడ్ మైదానంలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 230 పరుగుల తేడాతో గెలిచింది.
వికెట్ల పరంగా చూస్తే, ఆస్ట్రేలియా నాలుగు, ఇంగ్లాండ్ మూడు పర్యాయాలు పదేసి వికెట్ల తేడాతో విజయాలను నమోదు చేశాయి.
అత్యల్ప తేడాతో నమోదైన విజయం ఇంగ్లాండ్ దక్కించుకుంది. 2005 ఆగస్టులో బర్మింహామ్ టెస్టులో ఆ జట్టు కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచింది. 1902 జూలైలో ఆస్ట్రేలియా, 1982 డిసెంబర్‌లో ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో విజయాలను అందుకున్నాడు. 1885 సిడ్నీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు పరుగుల ఆధిక్యంతో గెలిచింది. యాషెస్‌లో పది కంటే తక్కువ పరుగుల తేడాతో నమోదైన విజయాలుగా ఇవి చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాయి.
అత్యధిక స్కోరులోనూ..
ఇంగ్లాండ్ అత్యధిక స్కోర్ల విషయంలో నూ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 1938 ఆగస్టులో ది ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్లకు 903 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. యాషెస్ సిరీస్‌లో, ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. 1930 జూన్‌లో జరిగిన లార్డ్స్ టెస్టులో 6 వికెట్లకు 729 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా, 1934 ఆగస్టులో ది ఓవల్ మైదానంలో 701 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో, ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన స్కోర్లలో వీటికి వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కాయి.
ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోరు కేవలం 36 పరుగులు. 1902 మే మాసంలో బర్మింహామ్‌లో జరిగిన ఆ టెస్టులో ఆస్ట్రేలియా 23 పరుగులకే కుప్పకూలింది. 1888లో ఆస్ట్రేలియా 42, అదే జట్టు 1896లో 44 పరుగులకు ఆలౌటైంది. అత్యల్ప స్కోర్ల జాబితాలో మొదటి మూడు స్థానాలు ఆస్ట్రేలియావే కావడం గమనార్హం.
కళ్లలో రంపంపొడి!
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కళ్లలో రంపంపొడి పడితే ఎలా ఉంటుంది? కళ్లు మండుతాయి. బంతి సరిగ్గా కనిపించదు. షాట్ల ఎంపికలో పొరపాట్లు జరుగుతాయి. సులభంగానే ఔటై పెవిలియన్‌కు చేరాల్సి వస్తుంది. తమ విషయంలో ఇదే జరిగిందు 1956లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో ఓడినప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ జాన్సన్ ఆరోపించాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ ఒక ఇన్నింగ్స్‌లో తొమ్మిది, మరో ఇన్నింగ్స్‌లో పది చొప్పున మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఆ బౌలింగ్ విశే్లషణ ఇంగ్లాండ్‌ను విజయపథంలో నడిపింది. అయితే, ఔట్‌ఫీల్డ్ తడిగా ఉన్నందున, అది త్వరగా ఆరేందుకు రంపంపొడి చల్లడమే తమ పరాజయానికి కారణమని జాన్సన్ తేల్చిచెప్పాడు. లేకపోతే, ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని అన్నాడు. కానీ, ఇంగ్లాండ్ మీడియా అతని ఆరోపణల్లో పస లేదని ఎదురుదాడికి దిగింది. ఒక టెస్టులో 19 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన లేకర్‌ను ఎదుర్కోలేక కుప్పకూలిన ఆస్ట్రేలియా దొంగ సాకులు వెతుక్కుంటున్నది ధ్వజమెత్తింది. ఇంతకీ ఏది నిజమో!