క్రీడాభూమి

ఐస్ మైదానంపై ఆధిపత్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: క్రికెట్ రంగంలో చిరకాల ప్రత్యర్థులుగా గుర్తింపు పొందిన భారత మాజీ ఓపెనర్ వీరందర్ సెవాగ్, పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిజ్ వద్ద, ఐస్ మైదానంపై వీరు ఆధిపత్య పోరాటాన్ని కొనసాగిస్తారు. సెయింట్ మోరిజ్ ఐస్ క్రికెట్ పేరుతో ఈ టోర్నమెంట్ 1988 నుంచి జరుగుతున్నది. అయితే, మొదటిసారి మేటి క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగే ఈ టోర్నీలో టి-20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. సెవాగ్, అక్తర్‌తోపాటు మహమ్మద్ కైఫ్, మహేల జయవర్ధనే, లసిత్ మలింగ, మైఖేల్ హస్సీ, గ్రేమ్ స్మిత్, జాక్వెస్ కాలిస్, డానియల్ వెటోరీ, నాథన్ మెక్‌కలమ్, గ్రాంట్ ఇలియట్, మోంటీ పనేసర్, ఓవైస్ షా వంటి మాజీ క్రికెట్లు ఈ పోటీల్లో అభిమానులను అలరించనున్నారు.