క్రీడాభూమి

సైనా, సింధు శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, నవంబర్ 22: హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు శుభారంభం చేశారు. అయితే, పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు. హైదరాబాదీ సైనా తొలి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన మెటే పాల్సన్‌ను 21-19, 23-21 తేడాతో ఓడించి, రెండో రౌండ్‌లో చెన్ యూఫెయ్‌తో పోరును ఖాయం చేసుకుంది. యూఫెయ్ 21-15, 21-13 ఆధిక్యంతో చెన్ సు యూపై సులభంగా గెలిచింది. ‘తెలుగు తేజం’ సింధు మొదటి రౌండ్‌లో లియాంగ్ యుయెట్ ఈపై 21-18, 21-10 స్కోరుతో విజయాన్ని నమోదు చేసి, రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. సైనా మాదిరిగానే సింధు కూడా వరుస సెట్లలో గెలవడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ రెండో రౌండ్ చేరాడు. మొదటి రౌండ్‌లో అతను హూ యున్‌ను 19-21, 21-17, 21-15 ఆధిక్యంతో ఓడించాడు. రెండోరౌండ్‌లో కజుమాసా సకాయ్‌ని ప్రణయ్ ఎదుర్కొంటాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు విక్టర్ ఎక్సెల్సెన్ ఫిట్నెస్ సమస్యల కారణంగా పోటీ నుంచి వైదొలగ్గా, వాకోవర్ లభించిన సకాయ్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. కాగా, కామనె్వల్త్ చాంపియన్ కశ్యప్ తీవ్రంగా పోరాడినప్పటికీ 21-15, 9-21, 20-22 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. సౌరభ్‌ను ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్తో 21-15, 21-6 తేడాతో చిత్తుచేశాడు.