క్రీడాభూమి

వార్నర్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, నవంబర్ 22: మెడ నొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వేగంగా కోలుకుంటున్నాడని ప్రటించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతనికి మొదటి యాషెస్ టెస్టులో చోటు కల్పించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టెస్టు సిరీస్ ప్రారంభంలోనే జట్టు వైస్-కెప్టెన్ వార్నర్ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కోవడం ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేసింది. అయితే, అతను వేగంగా కోలుకుంటున్నాడని, మొదటి టెస్టులో ఆడగలనన్న నమ్మకం అతనికి ఉందని సీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకే, అతనిని మొదటి టెస్టుకు ఎంపిక చేసినట్టు స్పష్టం చేసింది. ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ అంటే యుద్ధమేనని, ఆ జట్టు ఆటగాళ్లను శత్రువులుగానే చూస్తానని ఇటీవల వార్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వారితో సుమరానికి సిద్ధంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్ క్రికెటర్లను కేవలం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు చూడబోమని వార్నర్ తేల్చిచెప్పాడు. అందుకే, అతను తుది జట్టులో ఉంటేనే, మిగతా ఆటగాళ్లకు ప్రోత్సాహం ఉంటుందని సీఏ అభిప్రాయం. మొదటి టెస్టుకు అతనిని ఎంపిక చేయడం వెనుక ఆ కారణం కూడా ఉంది. ఇలావుంటే, గబ్బా స్టేడియంలో జరిగే మొదటి టెస్టులోనే ఇంగ్లాండ్‌కు కళ్లెం వేయాలన్న ఆలోచనతో ఉన్న సీఏ సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే, తొలి టెస్టుకు ఎంపిక చేసిన 13 మంది ఆటగాళ్లలో ఫాస్ట్ బౌలర్లు చాద్ సయెర్స్, జాక్సన్ బర్డ్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకోలేదు.

ఆస్ట్రేలియా జట్టు ఇదే: 1. స్టీవ్ స్మిత్ (కెప్టెన్), 2. డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్), 3. కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, 4. ఉస్మాన్ ఖాజా, 5. పీటర్ హ్యాండ్స్‌కోమ్, 6. షాన్ మార్ష్, 7. టిమ్ పైన్, 8. మిచెల్ స్టార్క్, 9. పాట్ కమిన్స్, 10. జొష్ హాజెల్‌వుడ్, 11. నాథన్ లియాన్.