క్రీడాభూమి

నింపాదిగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, నవంబర్ 23: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆచితూచి, నింపాదిగా అడుగులు వేసింది. వెలుతురు సరిగ్గా లేని కారణంగా సుమారు పది ఓవర్లు ముందుగానే ఆటను నిలిపివేసే సమయానికి నాలుగు వికెట్లకు 196 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్, మార్క్ స్టోన్‌మన్ అర్ధ శతకాలు నమోదు చేయడంతో, ఇంగ్లాండ్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టు కేవలం రెండు పరుగుల వద్ద తొలి వికెట్‌ను మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ రూపంలో కోల్పోయింది. 10 బంతులు ఎదుర్కొన్న అతను రెండు పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కోమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరంభంలోనే వికెట్ చేజారినప్పటికీ, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విన్స్‌తో కలిసి ఓపెనర్ స్టోన్‌మన్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొంటూ, స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించారు. 127 పరుగుల వద్ద స్టోన్‌మన్ వెనుదిరిగాడు. 159 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసిన అతను పాట్ కమిన్స్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత కొద్ది సేపటికే విన్స్ వికెట్ కూలింది. మంచి ఫామ్‌లో ఉన్న అతను 170 బంతుల్లో, 12 ఫోర్లతో 83 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కెప్టెన్ జో రూట్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పాట్ కమిన్స్‌కు వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం డేవిడ్ మలాన్ (28 నాటౌట్), మోయిన్ అలీ (13 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. టెస్టులో ఒక రోజు కనీసం 90 ఓవర్లు బౌల్‌కావాల్సి ఉండగా, 81 ఓవర్ ప్రారంభమయ్యే సమయానికే దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆ ఓవర్‌ను వేస్తున్న కారణంగా, బ్యాడ్‌లైట్‌గా ఆటను నిలిపేయాలని బ్యాట్స్‌మెన్ చేసిన విజ్ఞప్తికి అంపైర్లు సానుకూలంగా స్పందించారు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు నాలుగు వికెట్లకు 196 పరుగులకు చేరింది.
సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 80.3 ఓవర్లలో 4 వికెట్లకు 196 (మార్క్ స్టోన్‌మన్ 53, జేమ్స్ విన్స్ 83, డేవిడ్ మలాన్ 28 నాటౌట్, పాట్ కమిన్స్ 2/59, మిచెల్ స్టార్క్ 1/45).

చిత్రం..బంతిని లెగ్‌గ్లాన్స్‌తో బౌండరీకి తరలిస్తున్న జేమ్స్ విన్స్