క్రీడాభూమి

వైభవంగా భువీ వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరట్, నవంబర్ 23: భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వివాహం మీరట్‌లో ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు నూపుర్ నాగర్‌తో గత నెల 4న భువీ నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో భువీ వివాహం అట్టహాసంగా జరిగింది. శ్రీలంకతో రెండో టెస్టు శుక్రవారం నుంచి నాగపూర్‌లో ప్రారంభం కానుండడంతో టీమిండియా క్రికెటర్లు ఈ వివాహానికి రాలేకోయారు. అయితే, చివరిదైన మూడో టెస్టు ఆడేందుకు జట్టు సభ్యులు ఢిల్లీ వచ్చినప్పుడు, అక్కడ విందు ఉంటుందని భువీ తండ్రి ప్రకటించాడు. కాగా, నూపర్ స్వస్థలమైన బులంద్‌షహర్‌లో ఆమె తండ్రి భారీ విందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. చాలా తక్కువగా మాట్లాడే భువీకి నూపుర్‌తో చిన్నతనం నుంచే స్నేహం ఉంది. ఆమె గ్రేటర్ నోయిడాలో ఇంజనీర్‌గా పని చేస్తున్నది. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి అభ్యంతరం చెప్పకపోవడంతో, గత నెల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.

చిత్రం..సంప్రదాయ దుస్తుల్లో గుర్రంపై పెళ్లి మండపానికి వెళుతున్న భారత క్రికెటర్ భువనేశ్వర్ కుమార్