క్రీడాభూమి

డివిలియర్స్ అర్ధ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

37 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

ముంబయి, మార్చి 20: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా 37 పరుగుల తేడాతో గెల్చుకుంది. స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ అర్ధ శతకంతో జట్టు విజయానికి పునాది వేశాడు. బౌలర్ క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పరాజయాన్ని శాసించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకొని, 20 ఓవర్లలో 209 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. క్వింటన్ డికాక్ 31, కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ 41 పరుగులతో రాణించారు. డివిలియర్స్ 29 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు. అఫ్గాన్ బౌలర్లలో అమీర్ హంజా, దౌలత్ జద్రాన్, షాపూర్ జద్రాన్, మహమ్మద్ నబీ తలా ఒక్కో వికెట్ కూల్చారు.
దక్షిణాఫ్రికాను ఓడించడానికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నప్పటికీ అఫ్గాన్ జట్టు శక్తివంచన లేకుండా కృషి చేసింది. అయితే, లక్ష్యాన్ని ఛేదించలేక 172 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ షెజాదీ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గుల్బదీన్ నయిబ్ 26, సలీముల్లా హెర్వానీ 25 చొప్పున పరుగులు చేశారు. మిగతా వారంతా ఎంత శ్రమించినా చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ 27 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. కాగిసో రబద, కేల్ అబోట్, ఇమ్రాన్ తాహిర్‌లకు తలా రెండు వికెట్లు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 (క్వింటన్ డికాక్ 45, ఫఫ్ డు ప్లెసిస్ 41, ఎబి డివిలియర్స్ 64, జీన్‌పాల్ డుమినీ 19 నాటౌట్, అమీర్ హంజా 1/25, దౌలత్ జద్రాన్ 1/46, షాపూర్ జద్రాన్ 1/28, మహమ్మద్ నబీ 1/35).
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 172 ఆలౌట్ (మహమ్మద్ షెజాదీ 44, గుల్బదీన్ నయిబ్ 26, సలీముల్లా షెర్వానీ 25, క్రిస్ మోరిస్ 4/37, రబద 2/37, కేల్ అబోట్ 2/36, ఇమ్రాన్ తాహిర్ 2/24).