క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ నాదల్‌కు జొకొవిచ్ బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ పురుషుల సింగిల్స్‌లో టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. సెమీ ఫైనల్‌లో అతను చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌ను 7-6, 6-2 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ దాదాపుగా ఏకపక్షంగా సాగింది. తొలి సెట్‌లో చివరి వరకూ పోటీనిచ్చిన నాదల్ రెండో సెట్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. చాలాకాలంగా ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న నాదల్ ఆ సమస్య నుంచి చాలా వరకు కోలుకున్నట్టు ఈ టోర్నీలో అతని ఆట తీరు స్పష్టం చేసింది. అయితే, అంతర్జాతీయ సర్క్యూట్‌పై అపారమైన అనుభవం ఉన్న జొకొవిచ్ ఎలాంటి సమస్య లేకుండా నాదల్‌ను ఓడించి ఫైనల్‌లో మిలోస్ రవోనిక్‌తో పోరును ఖాయం చేసుకున్నాడు. మరో సెమీ ఫైనల్‌లో రవోనిక్ 6-3, 3-6, 6-3 ఆధిక్యంతో డేవిడ్ గోఫిన్‌ను ఓడించి ఫైనల్‌లో స్థానం సంపాదించాడు.