క్రీడాభూమి

టీసీఎల్‌కు ‘హీరా’ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: క్రికెట్‌లో కొత్తగా రంగ ప్రవేశం చేసిన టి-10 ఫార్మాట్‌కు హీరా గ్రూప్ సంస్థ మద్దతు ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు జరిగే టి-10 క్రికెట్ లీగ్ (టీసీఎల్) టోర్నమెంట్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో టోర్నమెంట్ వివరాలను ప్రకటించారు. ఒక్కో జట్టుకు 10 ఓవర్లు ఉండే, ఈ 90 నిమిషాల మ్యాచ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయనడంలో సందేహం లేదు. ఒక రకంగా దీనిని క్రికెట్‌లో విప్లవాత్మక మార్పుగా పేర్కోవచ్చు. దక్షిణాసియాకు చెందిన పంజాబీ లెజెండ్స్, పాకిటూన్స్, మరాఠా అరేబియన్స్, బెంగాల్ టైగర్స్, టీమ్ శ్రీలంక క్రికెట్, కేరళ కింగ్స్ ఈ టోర్నీలో పాల్గొంటాయి. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిదీ, భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్, ఇంగ్లాండ్ వనే్డ, టి-20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వంటి హేమాహేమీలు టీసీఎల్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యుఏఈలో చారిత్రక నేపథ్యం కలిగిన షార్జా క్రికెట్ స్టేడియం ఈ పోటీలకు ఆతిథ్యమిస్తుంది. క్రికెట్ విలువలకు వినోదపు సొబగులను కూడా అద్దే టి-10 క్రికెట్ టోర్నమెంట్‌కు టైటిల్ స్పాన్సర్‌గా ఉండడం ఎంతో ఆనందంగా ఉందని హీరా గ్రూప్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ నౌహెర షేఖ్ అన్నారు. ఒక వ్యాపర సంస్థగా ఎప్పుడూ వినూత్నమైన ఆలోచనలకు మద్దతునిస్తామని, అది తమ వ్యాపార విధానమని ఆయన పేర్కొన్నారు. టి-10 ఫార్మాట్ గురించి విన్న తర్వాత, దానిపై తన బృందంతో కలిసి చర్చించామని, ఫుట్‌బాల్, హాకీ మాదిరిగానే 90 నిమిషాల నిడివిగల క్రికెట్ మ్యాచ్‌లకు విశేష స్పందన వస్తుందన్న నమ్మకం తమకు కుదిరిందని తెలిపారు.
టి-10 ఫార్మాట్‌కు రూపకల్పన చేసి, టీసీఎల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న యూఏఈ క్రికెట్ బోర్డు సభ్యుడు షాజీ ఉల్ ముల్క్ కూడా టోర్నమెంట్ విజయవంతమవుతుందని ధీమా వ్యక్చేశారు. కాలంతోపాటు మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ అభిమానులకు ఇంత కంటే మంచి వినోదాన్ని అందించలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలల పాటు విస్తృతంగా చర్చించి, ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత టీసీఎల్ నిర్వహణపై ఒక అవగాహనకు వచ్చినట్టు చెప్పారు. వినోదం కేవలం మైదానికే పరిమితం కాకుండా, మైదానం వెలుపల కూడా నాలుగు రోజుల పాటు ఒక ఉత్సవంగా కొనసాగే టీసీఎల్‌ను యుఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే దీనికి అనుమతినిచ్చింది. టోర్నమెంట్‌లో ప్రతి జట్టు ప్రవేశం ఒక అద్భుత నేపథ్యంలో ప్రారంభమవుతుంది. సినీ తారలు, ఆటగాళ్లు కనువిందు చేస్తారు. కళా ప్రదర్శనలు అభిమానులను మంత్ర ముగ్ధులను చేయడం ఖాయం. ఈ కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ ఐకాన్ ‘ది గ్రేట్’ ఖలీ, హీరా గ్రూప్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

చిత్రం..యూఏఈలో ఈనెల 14 నుంచి 17 వరకు జరిగే టి-10 క్రికెట్ లీగ్ (టీసీఎల్) టోర్నమెంట్ వివరాలను ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటిస్తున్న స్టార్ రెజ్లర్ ‘ది గ్రేట్’ ఖలీ, హీరా గ్రూప్ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ నౌహెర షేక్, టోర్నీ చైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తదితరులు